లాడ్జిలో బంధించి.. మాజీ ప్రేయసిపై 2రోజులుగా అత్యాచారం

ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మృగాళ్ల కామవాంఛకు అబలలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది.

news18-telugu
Updated: February 12, 2019, 8:22 PM IST
లాడ్జిలో బంధించి.. మాజీ ప్రేయసిపై 2రోజులుగా అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకప్పుడు అతణ్ని నమ్మింది. ఫ్రెండ్‌షిప్ చేసింది. చనువుగా మెలిగింది. ఆ తర్వాత అతని నిజస్వరూపం తెలుసుకుని దూరం పెట్టింది. దీంతో అమ్మాయిపై అతడు పగ పెంచుకున్నాడు. ఘోరానికి తెగబడ్డాడు. బెదిరించి, ఆమెను రూమ్‌లో బంధించి పశువులా ప్రవర్తించాడు. రెండ్రోజులుగా అత్యాచారం చేస్తూ నరకం చూపించాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. బైసార్‌కు చెందిన 23 ఏళ్ల ఫైసల్ సైఫీ.. 21 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అంతకు ముందు తనతో చనువుగా ఉండి.. ఆ తర్వాత దూరమైన ఆమెపై కక్ష పెంచుకున్నాడు.  బెదిరింపులకు దిగాడు. గతంలో తనతో చనువుగా ఉన్నప్పుడు సీక్రెట్ తీసిన వీడియోలను ఫొటోలను.. ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరిస్తూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేశాడు. లేదంటే ఫొటోలు, వీడియోలు అందరికీ షేర్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమెకు ఫోన్‌చేసి మాట్లాడుకుందామంటూ ఓ లాడ్జ్‌కు రమ్మన్నాడు. అక్కడే.. ఫొటోలు, వీడియోలు డిలీట్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన యువతి.. లాడ్జ్‌కు వెళ్లింది. అయితే అవన్నీ మోసపూరిత మాటలేనని అక్కడికి వెళ్లాక ఆమెకు అర్థమైంది. ఆమెను రూమ్‌లో బంధించిన ఫైసల్ సైఫీ... రెండ్రోజులుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. నరకం చూపించాడు. మంగళవారం ఉదయం ఆమెను లాడ్జి నుంచి బయటకు పంపించాడు.

బయటకు వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది యువతి. ఫైసల్ సైఫీ చేసిన ఘోరాన్ని వివరించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సైఫీని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కటకటాల్లోకి నెట్టి తమ స్టైల్లో విచారిస్తున్నారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...