Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Affair: వివాహేతర సంబంధం వల్ల బిడ్డను కని.. ఆ విషయం నైట్ డ్యూటీకెళ్లిన భర్తకు తెలియకుడదని..

Wife Affair: వివాహేతర సంబంధం వల్ల బిడ్డను కని.. ఆ విషయం నైట్ డ్యూటీకెళ్లిన భర్తకు తెలియకుడదని..

శివానిని అరెస్ట్ చేసిన పోలీసులు

శివానిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజబ్‌ సింగ్ శ్రీవాత్సవ్, శివాని(23)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమె తన అత్తమామలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉండేది. అజబ్‌సింగ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు.

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భాగస్వామి వివాహేతర సంబంధం గురించి తెలిసి కొందరు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు హత్య చేసి నేరస్తులుగా మారుతున్నారు. ఇంకొందరు వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భాగస్వామిని, కడుపున పుట్టిన కన్నబిడ్డలను కూడా వారి కామ కత్తికి బలిస్తున్నారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాడి అవాంఛిత గర్భం దాల్చి.. ఆ పుట్టిన బిడ్డలను చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో పడేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వల్ల గర్భం దాల్చిన ఓ మహిళకు ఆమె భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో పురిటి నొప్పులొచ్చాయి. పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిందన్న విషయం తెలిస్తే తన భర్త ఎక్కడ ఇంట్లో నుంచి గెంటేస్తాడేమోనన్న భయంతో భర్త డ్యూటీ నుంచి వచ్చే లోపు ఆ పాపను మాయం చేసింది ఆ మహా తల్లి. ఆ పాపను చంపేసి.. ఓ నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి.. ఉదయాన్నే తమ వీధికి వచ్చిన చెత్త వ్యాన్‌లో పడేసింది. ఆ వ్యాన్ డ్రైవర్ చెత్తను డంప్ చేసే సమయంలో పాపను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దాదాపు నాలుగు నెలల విచారణ తర్వాత ఆ పాపను కన్న తల్లే చంపి చెత్త తరలించే వ్యాన్‌లో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజబ్‌ సింగ్ శ్రీవాత్సవ్, శివాని(23)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమె తన అత్తమామలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉండేది. అజబ్‌సింగ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు. శివాని కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఆ విషయం అహ్మదాబాద్‌లో ఉన్న ఆమె భర్తకు తెలియదు. ఈ క్రమంలోనే ఆ వివాహేతర సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం అజబ్‌సింగ్‌కు తెలిసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. మొత్తానికి పెద్దలు రాజీ కుదిర్చి.. ఆరు నెలల క్రితం శివానిని అజబ్‌సింగ్‌తో అహ్మదాబాద్‌కు పంపించారు.

భార్య చేసిన పని వల్ల ఆమెతో కలిసి ఉంటున్నప్పటికీ అజబ్‌సింగ్ అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. రోజూ నైట్ డ్యూటీకి వెళ్లేవాడు. గర్భవతి అయిన శివాని అహ్మదాబాద్‌లో కుచ్‌చి జైన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ సెంటర్‌లో చెకప్ చేయించుకునేది. అబార్షన్ కుదరదని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. చూస్తుండగానే నెలలు నిండాయి. ఫిబ్రవరి 13న శివాని భర్త అజబ్‌సింగ్ నైట్ డ్యూటీలో ఉండగా ఆమెకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వివాహేతర సంబంధం మూలంగా తనకు గర్భం రావడంతో కోపంతో ఉన్న భర్తకు ఈ విషయం తెలిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తాడని శివాని భయపడింది.

ఇది కూడా చదవండి: Vismaya: ఈ బంగారు తల్లి విస్మయ.. ఏ స్థితిలో చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

కన్నబిడ్డను పుట్టిన గంటల వ్యవధిలోనే చంపేసి భర్త ఉదయం వచ్చేలోపు ఆ నవజాత శిశువును కనిపించకుండా మాయం చేయాలనుకుంది. ఆ పాపను చంపేసి.. ఓ నల్లని ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి బాత్రూమ్‌లో దాచేసింది. ఉదయాన్నే చెత్తను తరలించే వ్యాన్ రాగానే ఆ డ్రైవర్ కళ్లుగప్పి పాపను ఉంచిన ప్లాస్టిక్ కవర్‌ను చెత్తలా ఆ వ్యాన్‌లో పడేసింది. ఆ తర్వాత ఏమీ జరగనట్టు డ్యూటీకి వెళ్లొచ్చిన భర్తతో రోజూలానే ప్రవర్తించింది. ఆ చెత్తను డంపింగ్ యార్డ్‌లో డంప్ చేసే సమయంలో చనిపోయిన ఆ నవజాత శిశువును చూసిన ఆ వ్యాన్ డ్రైవర్‌కు నోట మాట రాలేదు. వెంటనే భయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. నాలుగు నెలల విచారణ తర్వాత శివానిని నిందితురాలిగా తేల్చి అరెస్ట్ చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Ahmedabad, Couples, Crime news, Extra marital affair, New born baby, Uttar pradesh