బర్త్‌ డే పార్టీకి పిలిచి.. 23 మంది చిన్నారులను..

బర్త్ డే పార్టీకి అని పిలిచి 23 మంది చిన్నారులను బంధించాడో క్రిమినల్. తనను ఓ హత్య కేసులో ఇరికించారన్న కోపంతో గ్రామస్థులపై పగ తీర్చుకోవాలని తలచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్ వద్ద ఉన్న ఖర్తియా గ్రామంలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: January 31, 2020, 6:49 AM IST
బర్త్‌ డే పార్టీకి పిలిచి.. 23 మంది చిన్నారులను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బర్త్ డే పార్టీకి అని పిలిచి 23 మంది చిన్నారులను బంధించాడో క్రిమినల్. తనను ఓ హత్య కేసులో ఇరికించారన్న కోపంతో గ్రామస్థులపై పగ తీర్చుకోవాలని తలచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్ వద్ద ఉన్న ఖర్తియా గ్రామంలో చోటుచేసుకుంది. సుభాష్ భాతమ్(40) తన కూతురు పుట్టిన రోజు ఉందని పిల్లలను ఆహ్వానించాడు. అలా వచ్చిన 23 మంది పిల్లలను బంధించి పగ తీర్చుకునేందుకు కుట్ర చేశాడు. పిల్లలతో పాటు వచ్చిన తల్లులను కూడా బంధించి.. ఎవరైనా విడిపించుకునే ప్రయత్నం చేస్తే పిల్లల్ని చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో దాదాపు 9 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పిల్లల విడుదలకు ప్రణాళిక రచించారు.

ఈ క్రమంలో రంగంలోకి దూకిన రెస్క్యూ బృందాలు, పోలీసులు.. అర్ధరాత్రి వరకు ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని ఎన్కౌంటర్ చేసి పిల్లలకు విముక్తి కల్పించారు. నిందితుడి ఇంట్లోంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఓ హత్య కేసులో ఇతడ్ని గ్రామస్థులు ఇరికించారన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 31, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading