జీడి మామిడి తోటలోంచి కుక్కల అరుపులు.. ఏంటా అని లోపలికి వెళ్లి చూస్తే చెట్టుపై ఓ యువతి..

ప్రతీకాత్మక చిత్రం

కుక్కల అరుపులు వినిపిస్తున్న వైపుగా వెళ్లారు. ఓ మామిడి చెట్టు వద్ద రెండు కుక్కలు అరుస్తుండటంతో అక్కడే ఆగిపోయారు. ఆ చెట్టు వద్ద ఏముందా అని తీక్షణంగా చూస్తే వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ మామిడి చెట్టుపై ఓ యువతి కూర్చుని ఉన్నట్టుగా ఉంది.

 • Share this:
  ఊరి చివర జీడి మామిడి తోట. ఆ తోటలోంచి కుక్కల అరుపులు రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులకు వినిపించాయి. ఏమయిందా ఏంటా అని వారికి అనుమానం వచ్చింది. అంతే కొందరు వ్యక్తులు ఆ తోట లోకి వెళ్లారు. కుక్కల అరుపులు వినిపిస్తున్న వైపుగా వెళ్లారు. ఓ మామిడి చెట్టు వద్ద రెండు కుక్కలు అరుస్తుండటంతో అక్కడే ఆగిపోయారు. ఆ చెట్టు వద్ద ఏముందా అని తీక్షణంగా చూస్తే వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ మామిడి చెట్టుపై ఓ యువతి కూర్చుని ఉన్నట్టుగా ఉంది. పరిశీలనగా చూస్తే వారికి అప్పుడు తెలిసింది. ఆమె చనిపోయి ఉందని. దీంతో ఈ ఘటనపై ఊళ్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి వివరాలు సేకరించారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలోని డాబుగాం సమితి, ఘోడాఖంటి గ్రామ పంచాయతీలో మఝిగుడ అనే ఓ గ్రామం ఉంది. ఆ ఊరి చివర ఓ జీడిమామిడి తోట ఉంది. ఆ తోటలో శుక్రవారం ఓ యువతి మృతదేహం బయటపడింది. చెట్టుపై కూర్చున్నట్టుగా ఆ యువతి మృతదేహం ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరి వేసుకున్నట్టుగా లేకుండా, కూర్చోబెట్టిన స్థితిలో ఉండటంతో, ఆమెను ఎవరో చంపి, ఇక్కడ పడేసి ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యువతి ఎవరా అని పోలీసులు ఆరా తీశారు. అదే ఊరికి చెందిన లలిఫా హరిజన్ అనే 22 ఏళ్ల యువతిగా తేల్చారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఆమె మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్లిందనీ, తిరిగి ఇంటికి రాలేదనీ పోలీసుల విచారణలో వెల్లడయింది.
  ఇది కూడా చదవండి: బయటపడ్డ అసలు నిజం.. గంటకో కట్టుకథ చెబుతూ ముప్పతిప్పలు.. పోలీసులకు డౌట్ రాకుండా ప్రియుడిని భయ్యా అని పిలిస్తూ..

  ఈ వారం రోజుల పాటు ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎవరితోపాటు వెళ్లింది? ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, కనిపించకుండా పోయిన కూతురు ఇలా శవంగా ప్రత్యక్షమవడంతో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని చంపిన వారిని పట్టుకుని వాళ్లకు కూడా ఇదే రకమైన శిక్షను విధించాలని డిమాండ్ చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం డాబుగాం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు
  Published by:Hasaan Kandula
  First published: