Home /News /crime /

22 YEAR OLD STABBED TO DEATH BY 5 PEOPLE IN RAJASTHAN PAH

Shocking: వాకింగ్ లో యువకులతో వాగ్వాదం.. కత్తులతో దాడికి తెగబడ్డ గ్యాంగ్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: కొందరు గ్యాంగ్ గా ఏర్పడి చిన్న విషయానికే, ఒక యువకుడి తో గొడవకు దిగారు. అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది . ఈ క్రమంలో విచక్షణను కోల్పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

22 Years boy Stabbed To Death By 5 People In Rajasthan: రాజస్థాన్ లోని కోటాలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న. అమర్ కాలనీలో తబిష్ అనే యువకుడు.. సంజయ్ నగర్ లో వాకింగ్ కు వెళ్లాడు.అక్కడ కొంత మంది యువకులతో వాగ్వాదం జరిగింది. వారు వెంటనే మూకుమ్మడిగా తబిష్ పై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత.. కత్తితీసుకుని విచకణ రహితంగా దాడికి పాల్పడ్డారు.

వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. బాధితుడు చికిత్స తీసుకుంటూ.. మంగళవారం మృతి చెందాడు. పోలీసులు ఐదుగురు నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు . అరెస్టు చేసిన వారిలో సుహెల్, తోఫిక్, సమీర్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Minor boy thrashed, head tonsured for stealing wheat in MP: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గోధుమలు దొంగిలించాడని ఓ వ్యవసాయ మార్కెట్‌లో బాలుడిని అతి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత గుండు గీయించారు. ఈక్రమంలో.. బాలుడు పారిపోకుండా కొందరు గట్టిగా పట్టుకున్నారు. తీవ్రంగా నోటికొచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, తాను ఆ గోధుమలు దొంగిలించలేదని బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో సంభవించింది. గునా జిల్లాలోని మధుసూధన్‌గడ్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ వీడియోను పరిశీలించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివరాజ్ భీల్ అనే వ్యక్తిని గుర్తించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోనికి తీసుకొలేదని పోలీసులు తెలిపారు.

ఆ మైనర్ బాలుడు నిజంగానే గోధుమలు దొంగిలించాడా? లేదా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాలుడిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని మధుసూదన్‌గడ్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనూప్ భార్గవ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Attack peoples, Crime news, Gang war, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు