తిడుతున్నాడని తండ్రిని చంపి...ముక్కలుగా నరికిన కొడుకు..

రోజూ తిడుతున్నాడన్న కోపంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. స్నేహితుల సహాయంతో వాటిని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: May 22, 2019, 7:30 PM IST
తిడుతున్నాడని తండ్రిని చంపి...ముక్కలుగా నరికిన కొడుకు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 7:30 PM IST
క్షణికావేశంలో హత్య చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కోపంలో ఏం చేస్తున్నామో అర్థంకాని పరిస్థితుల్లో.. ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు వ్యక్తులు. కన్న తల్లిదండ్రులను కూడా అతికిరాతకంగా హత్యచేస్తున్నారు. తాజాగా తూర్పు ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్తి కోసం తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. తండ్రిని చంపి ముక్కలు ముక్కులుగా నరికిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాదారలోని ఫార్శ్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

48 ఏళ్ల సందేశ్ అగర్వాల్ కాస్మొటిక్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు అమన్ (22) కేఫ్ నడుపుతున్నాడు. ఐతే వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని అమన్‌ను సందేశ్ అగర్వాల్ నిత్యం తిట్టేవాడు. బుధవారం ఉదయం కూడా అమన్, సందేశ్ అగర్వాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అమన్ తీవ్ర ఆగ్రహానికి గురై తండ్రిని చంపేశాడు. రోజూ తిడుతున్నాడన్న కోపంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. స్నేహితుల సహాయంతో వాటిని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి తనను ఎప్పుడూ తిడుతుండటంతోనే హత్య చేశానని అమన్ నేరాన్ని ఒప్పుకున్నాడు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...