మోడలింగ్ పేరుతో యువతికి వల... నరబలికి సన్నాహాలు... చివర్లో ట్విస్ట్

సూర్యగ్రహణం సమయంలో నరబలి ఇస్తే... శని వదిలిపోతుందనీ, అదృష్టం కలిసొస్తుందనీ... ఇలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్లు చేసిన ఘనకార్యమే ఇది.

news18-telugu
Updated: December 27, 2019, 7:59 AM IST
మోడలింగ్ పేరుతో యువతికి వల... నరబలికి సన్నాహాలు... చివర్లో ట్విస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
22 ఏళ్ల అమ్మాయి. అందంగా ఉంటుంది. మోడలింగ్ కెరీర్ ఎంచుకోవాలనుకుంది. నేపాల్‌లో అలాంటి అవకాశాలు తక్కువ కదా. అందుకే ఇండియా వెళ్లాలనుకుంది. బీహార్‌కి చెందిన ఓ మహిళ... ఆ యువతిని కలిసింది. ఆమెను ఇండియాకి తీసుకెళ్లి... భోజ్‌పురి సినిమాల్లో ఆఫర్లు వచ్చేలా చేస్తానంది. తాము చేస్తున్న మ్యూజిక్ వీడియోలో... మోడల్‌గా ఆఫర్ ఇస్తానంది. ఆమె చెప్పిన మాటలు... ఆ యువతికి వేదమంత్రాల్లా అనిపించాయి. ఆ మహిళతో పాటూ మరో ఆరుగురు, యువతి కలిసి... నేపాల్ రాజధాని ఖాట్మండూ నుంచీ... బీహార్‌లోని జోగ్బానీకి వచ్చారు. ఈ బ్యాచ్ అంటే ఎప్పటి నుంచో మరో బ్యాచ్‌కి ఇష్టం లేదు. ఓ అందమైన అమ్మాయిని ఈ బ్యాచ్... తమతో తెచ్చిందన్న విషయం... ఆ ప్రత్యర్థి బ్యాచ్‌కి తెలిసింది. ఈ బ్యాచ్ పని పట్టాలనుకున్న ఆ బ్యాచ్... వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పింది. అలర్టైన పోలీసులు... ఈ బ్యాచ్ ఉన్న చోటికి వెళ్లి సడెన్ రైడ్ చేశారు. అంతే... యువతితోపాటూ... ఏడుగురు దొరికారు. యువతిని కాపాడిన పోలీసులు... ఆ ఏడుగుర్నీ అరెస్టు చేశారు. వారి నుంచీ రూ.1,09,500 క్యాష్, మొబైల్ ఫోన్స్, రూ.9 లక్షలకు సంబంధించి ఏడు బ్యాంక్ చెక్‌లు, 7 ATM కార్డులు, నరబలి, క్షుద్రపూజలకు వాడా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ బ్యాచ్‌కి క్షుద్రపూజలు చేసే అలవాటుంది. సూర్యగ్రహణం రోజున ఆ యువతిని లేపేయాలని స్కెచ్ వేశారు. అందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అందమైన అమ్మాయిని నేపాల్ నుంచీ తెచ్చారు. ఐతే... ఇదంతా ఎవరో వీళ్లతో చేయించాలని డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ చెక్కులు, ఆ డబ్బుల్ని బట్టీ... ఎవరో పెద్ద డీలే కుదుర్చుకున్నట్లు సమాచారం అందుతోంది. వాళ్లెవరన్నది పోలీసులు త్వరలో తేల్చుతామంటున్నారు. ప్రస్తుతానికి యువతిని సేఫ్‌గా నేపాల్ పంపిస్తామని తెలిపారు. ఇదీ మేటర్. అప్రమత్తంగా ఉండకపోతే... ఇలాంటి ముఠాలే తగులుతాయి. అడ్డంగా బుక్కైపోతాం. బీకేర్‌ఫుల్.
Published by: Krishna Kumar N
First published: December 27, 2019, 7:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading