పట్టాలపై సెల్ఫీ... ఎదురుగా రైలు... కట్ చేస్తే విషాదం

సెల్ఫీ తీసుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే... ఎక్కడ తీసుకుంటున్నామన్నది మేటర్. రైలు పట్టాలపై సెల్ఫీలు తీసుకోకూడదు. అది కూడా బ్రిడ్జి ఉన్న చోట అస్సలు తీసుకోకూడదు. అలా చేస్తే ఇలా అయ్యే ప్రమాదం ఉంటుంది.

news18-telugu
Updated: January 27, 2020, 11:06 AM IST
పట్టాలపై సెల్ఫీ... ఎదురుగా రైలు... కట్ చేస్తే విషాదం
పట్టాలపై సెల్ఫీ... ఎదురుగా రైలు... కట్ చేస్తే విషాదం (File)
  • Share this:
ఆమె ఓ అమ్మాయి. వయసు 21 ఏళ్లు. బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో ఉన్న బ్రిడ్జి ఎక్కింది. తనతోపాటూ తన ఫ్రెండునూ అక్కడకు తీసుకెళ్లింది. ఆ బ్రిడ్జి కింద నది తన దారిన తాను పోతోంది. బ్రిడ్జి పైన రైలు పట్టాలున్నాయి. అమ్మాయి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది. ఇక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటే అనుకుంది. పక్కనున్న ఫ్రెండు... వద్దే రైలు వస్తే డేంజర్ అంది. ఏంటే డేంజర్... రైలు వస్తే వస్తుంది... ఆ లోగా సెల్ఫీ తీసేసుకుంటాం... పక్కకు వచ్చేస్తాం అంది. నాకొద్దు నువ్వే వెళ్లు అంది పక్కనున్న అమ్మాయి. ఏంటో... ప్రతీ దానికీ భయపడతావ్... ఇలాగైతే... టిక్ టాక్ వీడియోలేం చేస్తావ్... అంటూ... వెళ్లి పట్టాలపై నిల్చుంది. పక్కనున్న అమ్మాయి ఆ పక్క ఎక్కడో ఉంటే... రావే రా అంటూ ఆమెను కూడా పిలిచింది. మొహమాటం కొద్దీ ఆ అమ్మాయి కూడా పట్టాలపైకి వెళ్లింది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఓ రైలు రావడం మొదలైంది. మొబైల్ కెమెరా ఆన్ చేసింది. అటుగా రైలు వేగంగా వస్తోంది. త్వరగా సెల్ఫీ తియ్యి... అంది పక్కనున్న అమ్మాయి. తీస్తున్నా... తీస్తున్నా అంటూ... అరే చీకటిగా ఉంది... ఫ్లాష్ ఆన్ చేస్తా అంటుంటే... అవతల రైలు వచ్చేస్తోంది. త్వరగా త్వరగా అంటుంటే... అలా సెల్ఫీ తీసుకునేలోపే రైలు వచ్చేసింది. అది చూసిన పక్కనున్న అమ్మాయి... పిటి ఉషలా గెంతుతూ... పట్టాలపై నుంచీ పక్కకు గెంతి... ఆ ఊపులో ఏకంగా బ్రిడ్జిపై నుంచీ కిందనున్న నదిలోకి దూకేసింది. ఇవతల ఈ అమ్మాయిని రైలు ఒక్క గుద్దు గుద్దింది. అంతే... బాడీ ఎగిరి పక్క పట్టాలపై పడింది. అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నదిలో పడిన అమ్మాయి కేకలు పెడుతుంటే... స్థానికులు కాపాడి... నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో చేర్చారు.

ఇంతకీ ఆ అమ్మాయిలు బ్రిడ్జి పైకి ఎలా వచ్చారు? అన్న ప్రశ్న రైల్వే అధికారుల నుంచీ వచ్చింది. ఎలా అంటే... మైనాగురిలోని ఓ కోచింగ్ సెంటర్‌కి చెందిన వంద మంది విద్యార్థులు, విద్యార్థునులు... ఘిస్ నది ఒడ్డుకు వెళ్లారు... సరదా ట్రిప్ కోసం. ఆ గుంపు నుంచీ ఈ ఇద్దరు అమ్మాయిలూ ఎస్కేప్ అయ్యారు. చుట్టుపక్కల సెల్ఫీలు తీసుకున్నా... వాళ్లకు అవి అంతగా నచ్చలేదు. ఇంకా ఏదైనా స్పెషల్‌ సెల్ఫీ కావాలనుకున్నారు. రైల్వే బ్రిడ్జి ఎక్కారు. తర్వాత మేటర్ మీకు తెలిసిందే.

Video : రోడ్డుపై 20 సింహాలు... షాకైన కారులో ప్రయాణికులు...


Published by: Krishna Kumar N
First published: January 27, 2020, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading