Home /News /crime /

21 YEARS OLD SRIKAKULAM YOUTH COMMIT SUICIDE AT RAILWAY TRACKS EVEN AFTER HE SELECT FOR SSB CONSTABLE JOB FULL DETAILS HERE HSN

పదేళ్ల క్రితం తండ్రి మృతి.. కష్టపడి చదివించిన తల్లి.. ఎస్‌ఎస్‌బీ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని సంతోషించేలోపే ఊహించని ఘోరం..!

శివ కిషోర్ (ఫైల్ ఫొటో)

శివ కిషోర్ (ఫైల్ ఫొటో)

పదేళ్ల క్రిందటే తండ్రి చనిపోయాడు. అయినా ఆ తల్లి కష్టపడి కొడుకును చదివించింది. కొడుకు కూడా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో చేరాలంటూ మూడ్రోజుల క్రితమే కాల్ లెటర్ కూడా వచ్చింది. ఇంతలోనే..

    పదేళ్ల క్రిందటే తండ్రి చనిపోయాడు. అయినా ఆ తల్లి కష్టపడి కొడుకును చదివించింది. కొడుకు కూడా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో చేరాలంటూ మూడ్రోజుల క్రితమే కాల్ లెటర్ కూడా వచ్చింది. పడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆ తల్లి, అతడి ఇద్దరు అక్కలు ఎంతగానో సంతోషించారు. తమ కష్టాలన్నీ తీరిపోతాయని భావించారు. కానీ ఏమయిందో ఏమో ఆ కుర్రాడు మాత్రం ఇంట్లోంచి సడన్ గా మిస్సయ్యాడు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. బంధువులను, స్నేహితులను ఆ తల్లి ఆరా తీసింది. తన కొడుకు కోసం పరితపించింది. కానీ ఏ వార్తయితే వినకూడదననుకుందో అదే జరిగింది. రైలు పట్టాలపై విగతజీవిగా ఆ కుర్రాడు కనిపించాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నందివాడ పంచాయతీ భగవాన్ దాస్ పేటకు చెందిన అంగన్ వాడీ టీచర్ కోండ్రి తవిటమ్మ భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కష్టపడి 21ఏళ్ల కొడుకు కోండ్రి శివ కిషోర్ ను, ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. శివ కిషోర్ ఉన్నత చదువులు చదివాడు. తల్లి కష్టాన్ని చూసి బాగా చదివి మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. ఎస్‌ఎస్‌బీ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయినట్టు మూడ్రోజుల క్రితమే కాల్ లెటర్ కూడా వచ్చింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో మురిసిపోయింది. అతడి ఇద్దరు అక్కలు కూడా ఎంతగానో సంతోషించారు. తమ కుటుంబ కష్టాలు ఇక తీరినట్టేనని సంబరపడ్డారు. కానీ ఏమయిందో ఏమో కానీ ఊహించని ఘోరం జరిగింది.
    ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

    బయటకు వెళ్లి వస్తానంటూ మంగళవారం సాయంత్రం శివ కిషోర్ బయటకు వెళ్లాడు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్లాడు. అతడు ఎంతకూ రాకపోవడంతో ఆ తల్లి కంగారు పడింది. బంధువులకు, స్నేహితులకు ఫోన్లుచేసి అడిగింది. ఊరంతా వెతికింది. కానీ కొడుకు ఆచూకీ మాత్రం ఎంతకూ తెలియరాలేదు. బుధవారం ఉదయం శివకిషోర్ రైలు కింద పడి చనిపోయినట్టు ఆ తల్లికి పోలీసులు ఫోన్ చేయడంతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబమంతా దిగ్భ్రాంతి చెందింది. ఇంట్లో ఇటీవలి కాలంలో గొడవలు ఏమీ జరగలేదనీ, కొడుక్కు మంచి ఉద్యోగం వచ్చిందని అంతా సంతోషంగా ఉన్నానమీ, త్వరలోనే ఉద్యోగంలో చేరతానని చెప్పాడనీ, కానీ ఇంతలోనే ఈ ఘోరానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని ఆ తల్లీకూతుళ్లు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Srikakulam, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు