news18-telugu
Updated: December 27, 2019, 9:54 AM IST
ప్రతీకాత్మక చిత్రం
నిర్భయ.. అయేషా.. దిశ.. ఇలా కామాంధుల చేతిలో చితికిపోతున్న మహిళలు ఎందరో ఉన్నారు. అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఫలితం అంతంత మాత్రమే. తాజాగా.. ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఒక యువతి(21)ని కిడ్నాప్ చేసి ఆమెపై ఏడాదిన్నర పాటు 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లా వాసాయ్ తాలుకాలో చోటుచేసుకుందీ దారుణ ఘటన. యువతిని బలవంతంగా లొంగదీసుకున్న ఓ వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఓ చోట దాచి మళ్లీ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. అతడితో పాటు మిగతా వాళ్లు కూడా ఆమెను శారీరకంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఆ యువతి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆమెను వదలని ఆ నీచులు మళ్లీ ఆమెపై క్రూరంగా ప్రవర్తించారు. అయితే.. ఈ నెలలో వారి చెర నుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల చెంతకు చేరి జరిగినదంతా వివరించింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిందీ ఘటన. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
December 27, 2019, 9:54 AM IST