సెక్స్ కోసం షాకింగ్ ప్లాన్... యువతి అరెస్టు... 8 ఏళ్ల జైలుశిక్ష

సినిమాల్లో కూడా ఇలాంటి ట్విస్టులు ఉండవేమో. సింపుల్‌గా "నెవ్వర్ బిఫోర్... ఎవ్వర్ ఆఫ్టర్" అందామా...

news18-telugu
Updated: January 11, 2020, 6:10 AM IST
సెక్స్ కోసం షాకింగ్ ప్లాన్... యువతి అరెస్టు... 8 ఏళ్ల జైలుశిక్ష
సెక్స్ కోసం షాకింగ్ ప్లాన్... యువతి అరెస్టు... 8 ఏళ్ల జైలుశిక్ష (credit - Reuters)
  • Share this:
పై హెడ్డింగ్‌లో మీరు చదివింది నిజమే. 21 ఏళ్ల యువతే... పోలీసులు షాకయ్యే పని చేసింది. ఆమె పేరు గెమ్మా వాట్స్. బ్రిటన్‌కు చెందిన యువతి. తనకు తాను టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తూ... బాలికలకు వల వేసి... వాళ్లను రేప్ చేసింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... డజన్ల కొద్దీ టీనేజ్ బాలికలు... ఆమె ఉచ్చులో చిక్కుకున్నారు. నవంబర్‌లో అరెస్టైన ఆమెకు ఇప్పుడు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. వించెస్టర్ క్రౌన్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇదంతా చదివాక... ఇలా ఎలా జరుగుతుంది? ఆమె ఇలా ఎందుకు చేసింది? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. పోలీసులూ ఇలాగే షాకయ్యారు. ఓ మహిళే... బాలికల్ని రేప్ చెయ్యడమేంటని ఆశ్చర్యపోయారు. బట్ అదే జరిగింది. గెమ్మా వాట్స్... సోషల్ మీడియాలో జేక్ వాటన్ పేరు మీద ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్, ఫేస్‌బుక్ వంటి అకౌంట్లు తెరిచింది. తనను తాను మేల్ పర్సన్‌గా ప్రొఫైల్స్ రెడీ చేసుకుంది. 16 ఏళ్ల అబ్బాయిలలా డ్రెస్సులు వేసుకొని... జుట్టును ఉండలా చుట్టేసి... తలకు క్యాప్ పెట్టుకొని... ఫొటోలు పెట్టింది. అవి చూసిన ఎవరైనా సరే... అబ్బాయనే అనుకుంటారు తప్ప... అమ్మాయి అని అస్సలు అనుకోరు. అలా తయారైంది.

నెక్ట్స్... సోషల్ మీడియాలో బ్రిటన్‌లోని 14 ఏళ్ల లోపు బాలికలకు ఫ్రెండ్షిప్ రిక్వెస్టులు పంపింది. యాజ్ యూజువల్‌గా వాళ్లు రిక్వెస్టులను యాక్సెప్ట్ చేశారు. అలా వాళ్లతో పరిచయాలు పెంచుకొని... స్నేహాలు మొదలుపెట్టింది. హాయ్ బేబ్ అని పిలుస్తూ... మాటిమాటికీ మెచ్చుకుంటూ... మెల్లగా వాళ్ల పర్సనల్ విషయాలన్నీ తెలుసుకుంది. ఇళ్ల అడ్రెస్సులు కూడా తెలుసుకుంది. ఆ తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కరీ ఇళ్లకూ వెళ్లేది. వాళ్లతో సెక్సువల్ రిలేషన్‌షిప్ పెట్టుకునేది. వాళ్లకు లేనిపోని టాబ్లెట్ల వంటివి ఇచ్చి... మత్తులోకి దింపి... రేప్ చేసేది. ఇలా ఒక్కొక్కరితో చాలాసార్లు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

వేర్వేరు చోట్ల నలుగురు బాధిత బాలికలు కంప్లైంట్లు ఇవ్వడంతో... విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 7 కేసుల్లో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు... ఆమె చాలా మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆమెలో సెక్స్ కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ... కానీ... ఓ మహిళే... బాలికల్ని రేప్ చేయడం షాకింగ్ విషయమని పోలీసులు అంటున్నారు. ఓవరాల్‌గా కనీసం 50 మందైనా ఆమె బాధితులు ఉండి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.

First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు