21 YEAR OLD BOY FROM KERALA IDUKKI DISTRICT RAPED A 6 YEAR OLD GIRL FOR TWO YEARS SSR
Shocking: వామ్మో.. ఇలాంటి మానవ మృగాల మధ్య బతుకుతున్నామా.. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే..
నిందితుడు అర్జున్ (ఫైల్ ఫొటో)
కేరళలో దారుణం జరిగింది. 21 సంవత్సరాల వయసున్న ఓ యువకుడు ఆరేళ్ల చిన్నారిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమెను హత్య చేసి.. ఆ చిన్నారి తాడుతో ఆడుకుంటూ చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. తాడు ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకుని చనిపోయినట్లు పరిస్థితులను సృష్టించి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.
ఇడుక్కి: కేరళలో దారుణం జరిగింది. 21 సంవత్సరాల వయసున్న ఓ యువకుడు ఆరేళ్ల చిన్నారిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమెను హత్య చేసి.. ఆ చిన్నారి తాడుతో ఆడుకుంటూ చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. తాడు ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకుని చనిపోయినట్లు పరిస్థితులను సృష్టించి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వాండిపెరియార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ కేసు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021, జనవరి 30న వాండిపెరియార్లోని టీ గార్డెన్లో ఉన్న ఓ చిన్న ఇంట్లో ఆరేళ్ల వయసున్న చిన్నారి ఉరేసుకుని కనిపించింది. తాడుతో ఆడుకుంటుండగా.. దురదృష్టవశాత్తూ మెడకు బిగుసుకుని చనిపోయిందని అంతా భావించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ పాప తల్లిదండ్రులు, సోదరులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో అదే నిజమని అనుకున్నారు. అయితే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో అసలు విషయం తెలిసింది. చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ చిన్నారితో ఎవరో అతి క్రూరంగా శృంగారం చేసి.. ఆమెను రేప్ చేశారని పోస్ట్‌మార్టంతో స్పష్టమైంది. ఆ నిజం తెలిసి షాకైన పోలీసులు ఆమెది దురదృష్టవశాత్తూ సంభవించిన మరణమో.. ఆత్మహత్యనో కాదని నిర్ధారణకొచ్చారు. కేసు విచారణను సీరియస్‌గా తీసుకున్నారు. ఆ చిన్నారిని రేప్ చేసి.. చంపేసింది వాళ్ల పొరిగింట్లో ఉండే 21 ఏళ్ల అర్జున్ అనే యువకుడేనని తేల్చారు. బాధిత కుటుంబంతో అర్జున్‌కు మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. తరచుగా ఆ చిన్నారి ఉంటున్న ఇంటికి అర్జున్ వెళ్లేవాడు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలతో ఆడుకునేవాడు. ఈ క్రమంలోనే.. అర్జున్ మంచివాడని నమ్మి ఆ పాప తల్లిదండ్రులు, సోదరులు కూడా ఎవరి పనికి వాళ్లు వెళ్లేవారు. ఈ క్రమంలోనే.. అర్జున్‌లోని కామాంధుడు నిద్రలేచాడు. ఒంటరిగా ఇంట్లో ఆడుకుంటూ ఉండే ఆ పాపపై కన్నేశాడు.
గత రెండేళ్లుగా అవకాశం దొరికినప్పుడల్లా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారికి ఈ విషయం ఎవరితో చెప్పవద్దని చాక్లెట్లు కొనిచ్చేవాడు. దీంతో.. ఆ పాప జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. జనవరి 30న ఆ చిన్నారిని అర్జున్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ పాపపై అర్జున్ అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో ఆ చిన్నారి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. దీంతో.. భయంతో కాలూచేయి ఆడని అర్జున్ ఆ షాక్ నుంచి తేరుకుని ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి ఆమె అలానే ఉంటే అసలు విషయం తెలిసిపోతుందని భావించి ఆ చిన్నారిని ఉరేసి చంపేశాడు. అయితే.. తాడు బిగుసుకుని చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బాలిక ఇంట్లో కనిపించకపోయే సరికి.. ఆడుకోవడానికి అర్జున్ ఇంటికి వెళ్లి ఉంటుందని భావించి వెళ్లి చూడగా విగత జీవిగా ఆ బాలిక తాడుకు వేలాడుతూ కనిపించింది.
కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అర్జున్ ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’ అంటూ మొసలి కన్నీరు కార్చాడు. అర్జున్‌పై ఆ చిన్నారి తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. ఆ చిన్నారి అంత్యక్రియల్లో కూడా అర్జున్ పాల్గొన్నాడు. ఆ పాప కుటుంబానికి ఎప్పటికీ తన మీద అనుమానం రాకుండా సహాయం కూడా చేశాడు. అర్జున్ ఏడుపును ఆ చిన్నారి కుటుంబ సభ్యులు నమ్మినప్పటికీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ పోలీసులకు అర్జున్‌పై అనుమానం కలిగేలా చేసింది. అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించగా అత్యాచారం చేసి.. హత్య చేసింది తానేనని అర్జున్ ఒప్పుకున్నాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.