Home /News /crime /

2006 SOUTH AFRICAN MODEL MOLESTATION CASE ACCUSED ACQUITTED AS VICTIM FAILS TO APPEAR IN COURT NK

మోడల్‌పై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Mumbai Crime : 2005 నాటి ఈ కేసులో నిందితుడితోపాటూ... మోడల్ బాధితురాలు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆమె హాజరు కాలేదు. మరి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది?

    Mumbai Crime : ముంబైలోని ఓ సెషన్స్ కోర్టు... 2005 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా మోడల్‌పై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చినట్లైంది. ఇందులో సంచలనం ఏముంది అన్నది తేలాల్సిన విషయం. ఈ కేసులో బాధితురాలు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఎన్నిసార్లు ఆమెను కోర్టుకు రమ్మని పిలుస్తున్నా... ఆమె రావట్లేదు. అత్యాచార ఘటన తర్వాత ఆమె తన దేశానికి వెళ్లిపోయింది. ఐతే... తనపై అత్యాచారం జరిగిందని 2005 డిసెంబర్ 27-28 తేదీల్లో ఆమె కేసు పెట్టింది. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం... దేశీయ విమానాశ్రయం దగ్గరున్న బావా ఇంటర్నేషనల్ హోటల్‌లో ఆ ఇద్దరు వ్యక్తులూ ఆమెకు డ్రగ్స్ (నిద్రమాత్రలు) ఇచ్చారు. ఆమెకు ఒంట్లో బాలేదంటూ... హోటల్ లోంచీ కారులోకి ఎక్కించారు. తర్వాత కారులో అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఉల్హాస్‌నగర్‌లోని మరో హోటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై మరోసారి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిద్ర మత్తు వీడిన తర్వాత... ఆమెను బెల్టులతో ఇద్దరూ చితకబాదారనీ, తాను స్పృహ కోల్పోయేలా చేశారని ఆమె పోలీసులకు తెలిపారు 2005లో.

    ముంబై పోలీసులు అసత్యాలతో నమ్మించడం, సామూహిక అత్యాచారం, గాయపరచడం, హానికారక ఆయుధాలు వాడటం, డ్రగ్ ఇవ్వడం ఇలా చాలా సెక్షన్ల కింద కేసు రాశారు. 200 పేజీల ఛార్జ్‌షీట్ రెడీ చేశారు. ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా చేర్చారు. నిందితుల తరపు లాయర్లు మాత్రం వాళ్లు అమాయకులనీ, వాళ్లకు అస్సలు సంబంధమే లేదని మొండి పట్టు పట్టారు. దర్యాప్తు పూర్తై, ఛార్జిషీట్ కూడా ఫైల్ అవ్వడంతో... నిందితులు ఇద్దరికీ బెయిల్ లభించింది.

    బాలీవుడ్ సినిమాల్లో నటించి... కెరీర్ డెవలప్ చేసుకోవాలని సౌతాఫ్రికా నుంచీ వచ్చిన ఆ మోడల్... ఇప్పుడు కోర్టుకు హాజరు కాకపోవడంతో... ఎదురు చూసీ చూసీ కోర్టు ఏమీ చెయ్యలేకపోయింది. బాధితురాలు స్పందించనప్పుడు ఇలాంటి కేసులో ముందుకు వెళ్లలేమని నిర్ణయించిన సెషన్స్ జడ్జి... నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. అలా ఓ సామూహిక అత్యాచారం కేసులో సంచలన తీర్పు నమోదైనట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Molestation, Mumbai

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు