Home /News /crime /

20 YEARS OLD DALIT GIRL ROJA ALLEGEDLY RAPED AND HANGED TO DEATH IN TAMIL NADU KANCHIPURAM SK

మరో ఘోరం.. యువతిని రేప్ చేసి ఉరితీసిన రాక్షసులు

మృతురాలు రోజా

మృతురాలు రోజా

#JusticeForRoja హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి, కాంచీపురంలో రోజా హత్యలను ప్రస్తావిస్తూ.. దేశంలో మహిళలకు భద్రత లేదంటూ భగ్గుమంటున్నారు.

    చట్టాలంటే లెక్కలేదు.. శిక్షలంటే భయంలేదు..! దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు. వరంగల్‌లో మానస, శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్ ఘటనలను మరవక ముందే తమిళనాడులో మరో ఘోరం వెలుగు చూసింది. కాంచీపురంలో 20 ఏళ్ల రోజా అనే యువతి మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఓ ప్రైవేట్ ప్రాంతంలో ఉరికొయ్యకు వేలాడుతున్న రోజా డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఐతే రోజాను రేప్ చేసి చంపారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు.

    రోజా ముఖంపై కత్తి గాట్లు, గాయాలు కనిపించడతో.. ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారని అర్థమవుతోంది. చివరిసారిగా ఆమె తన మిత్రుడు రాజేష్‌తో కనిపించినట్లు సమాచారం. అతడే రోజాను చంపి ఉంటాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. #JusticeForRoja హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి, కాంచీపురంలో రోజా హత్యలను ప్రస్తావిస్తూ.. దేశంలో మహిళలకు భద్రత లేదంటూ భగ్గుమంటున్నారు. వాళ్ల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Gang rape, Rape and murder, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు