• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 20 YEARS JAIL TERM TO A MAN WHO RAPED FIVE YEARS OLD GIRL WHILE SHE PLAYING GAMES WITH HER BROTHER IN HYDERABAD HSN

Hyderabad: యూట్యూబ్ లో వీడియోలు చూడమని అన్నకు మొబైల్ ఇచ్చి.. చెల్లిని గదిలోకి తీసుకెళ్లి ఘోరం.. 20 ఏళ్ల జైలు శిక్ష

Hyderabad: యూట్యూబ్ లో వీడియోలు చూడమని అన్నకు మొబైల్ ఇచ్చి.. చెల్లిని గదిలోకి తీసుకెళ్లి ఘోరం.. 20 ఏళ్ల జైలు శిక్ష

ప్రతీకాత్మక చిత్రం

అయిదేళ్ల చిన్నారిపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తెలిసీ తెలియని మాటలతో తల్లిదండ్రులకు చెప్పింది. అంతే ఆగ్రహోదగ్రులయిన ఆ తల్లిదండ్రులు అతడి కోసం ఆరా తీశారు. కనిపించకపోవడంతో..

  • Share this:
    కామాంధుల దుశ్చర్యలకు అంతే లేకుండా పోతోంది. మహిళలనే కాదు చిన్న పిల్లలను కూడా మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. అమాయక పిల్లలను మాటల్లోకి దించి, చాక్లెట్ల వంటి తిను బండారాల ఆశను చూపి వారిని ఏమార్చుతున్నారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తెలిసీ తెలియని మాటలతో తల్లిదండ్రులకు చెప్పింది. అంతే ఆగ్రహోదగ్రులయిన ఆ తల్లిదండ్రులు అతడి కోసం ఆరా తీశారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుక్రత్ సింగ్ అలియాస్ సనం అనే 39 ఏళ్ల వ్యక్తి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే కొన్నాళ్ల పాటు అతడు అందరితోనూ మంచోడిగానే మెలిగాడు. ఆ తర్వాతే తన అసలు నిర్వాకాన్ని బయటపెట్టాడు. గతేడాది అక్టోబర్ ఏడో తారీఖున సాయంత్రం ఓ బాలిక తన అన్నతో కలిసి ఆడుకుంటోంది. అదే సమయంలో వచ్చిన అతడు ఆ ఇద్దరు అన్నాచెల్లెళ్లను తన గదిలోకి పిలిచాడు. చాక్లెట్లు ఇస్తానని లోపలికి పిలిచాడు. అది నిజమేనని నమ్మిన ఆ అన్నాచెల్లెళ్లు అతడితోపాటే గదిలోకి వెళ్లారు. ఆ బాలిక అన్నకు తన మొబైల్ ఇచ్చాడు. బయట కూర్చుని యూట్యూబ్ లో వీడియోలు పెట్టి చూసుకోమన్నాడు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    ఆ తర్వాత గదికి లోపల గడియపెట్టి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రోజు చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి నొప్పి అంటూ తల్లిదండ్రులతో బాధపడింది. విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఏమయిందని అడిగితే సుక్రత్ చేసిన దారుణాన్ని బయటపెట్టింతతి. దీంతో అదే రోజు తల్లిదండ్రులు మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అదే నెల 9వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు 10 వేల జరిమానా కూడా విధించింది. సుక్రత్ సింగ్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!
    Published by:Hasaan Kandula
    First published: