అతని పేరు జైమోన్. వయసు అంతా కలిపి 20 ఏళ్లు. కేరళలోని పాలా నగరంలో ఉంటున్నాడు. తాజాగా పాలా పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. పాలా SHO కేపీ థాంప్సన్ ప్రకారం... జైమోన్... మంచి ఫొటోలను మార్ఫింగ్ చేస్తాడు. నగ్న (Nude) ఫొటోలుగా మార్చుతాడు. వాటిని ఆన్లైన్లో అమ్ముతాడు. ఇలా సెలబ్రిటీల నుంచి ఫ్రెండ్స్‌కి చెందిన మహిళల వరకూ ఎవర్నీ వదల్లేదని తెలిసింది. ఇతను తరచూ ఫ్రెండ్స్ ఇళ్లకు, కూరగాయల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు... ఇలా మహిళలు ఎక్కువగా ఉండే చోటికి వెళ్తాడు. అక్కడ సౌండ్ పెద్దగా రాకుండా ఫొటోలు తీసే మొబైల్ కెమెరాను వాడి... సీక్రెట్‌గా మహిళల ఫొటోలు తీస్తాడు. తర్వాత మొబైల్లో ప్రత్యేక ఎడిటింగ్ యాప్ (Mobile App) వాడి వాటిని మార్ఫింగ్ చేస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలోని నెటిజన్లకు అమ్ముకుంటున్నాడు.
ఇదీ క్రైమ్ జరిగిన విధానం:
జైమోన్... ముందుగా... సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు తెరిచాడు. టెలిగ్రామ్, షేర్ చాట్ లాంటి సైట్లలో సైట్లు తెరిచి.. నిజమైన అమ్మాయిల ఫొటోలు షేర్ చేశాడు. వారి పేర్లను కూడా ఇచ్చాడు. క్రమంగా యువకులు అతని అకౌంట్‌కి కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అలా వారితో చాటింగ్ చేసేవాడు. అవతలి వారి ఇష్టాల్ని గుర్తించి... సెక్స్ చాటింగ్ (Sex chat) చేసేవాడు. అలా వారితో స్నేహం నటించేవాడు.
అమ్మాయిలతో మంచివాడిలా నటించేవాడు. అబ్బాయిలతో సెక్స్ చాటర్లా మాట్లాడేవాడు. అలా ఎవరికైతే సెక్స్ (sex) పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో... వారికి న్యూడ్ ఫొటోలు పంపేవాడు. వారికి అవి నచ్చేవి. మరిన్ని కావాలంటే డబ్బు ఇస్తే ఇస్తానని అనేవాడు. గూగుల్ పే, పేటీఎం లాంటి వాటి ద్వారా డబ్బు పొందేవాడు. అలా వారికి న్యూడ్ ఫొటోలు అమ్ముతున్నాడు.
6 నెలల్లో లక్షన్నర సంపాదన:
ఏ ఫొటోనైనా నగ్నంగా మార్ఫింగ్ చెయ్యగలడు జైమోన్. ఎవరైనా ఫలానా అమ్మాయి ఫొటో ఇచ్చి... దాన్ని నగ్నంగా మార్చి ఇమ్మంటే అలా కూడా చేసి ఇస్తున్నాడు. బాలికలు, యువతులు, తల్లులు ఇలా ఎవర్నీ వదల్లేదు. ఇలా ఆరు నెలల్లో రూ.లక్షన్నర సంపాదించాడు. వచ్చిన డబ్బుతో ట్రావెలింగ్ చేస్తూ... మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
కంప్లైంట్ ఇలా నమోదు:
ఓ మహిళకు సంబంధించిన మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో... ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను కంప్లైంట్ ఇవ్వడంతో... సైబర్ క్రైమ్ పోలీసులు వేటాడారు. మొబైల్ ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. ఇలా ఓ బూతు పురాణానికి బ్రేక్ పడింది. బయట తిరిగే మహిళలు అప్రమత్తంగా ఉండాలనీ... ఇలాంటి వాళ్లు రహస్యంగా ఫొటోలు తీసి, మార్ఫింగ్ చేసి, పరువు తీస్తున్నారని చెబుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.