ఆన్‌లైన్ క్లాసుల్లో యువతి... పరిచయమైన కుర్రాడు... ఆ తర్వాత షాక్

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

Online Class: మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు చదువుతున్నారా... అయితే జాగ్రత్త వారిని టార్గెట్ చేసే గ్యాంగులు మన దేశంలో చాలా ఉన్నాయి. ఇదిగో ఈ ఘటన అలాంటిదే. ఏం జరిగిందో తెలుసుకుంటే... ఒకింత భయం తప్పదు.

 • Share this:
  ఇది జరిగింది కేరళలోని కన్నూర్‌లో. 16 ఏళ్ల యువతి. చదువంటే ప్రాణం. తల్లి నుంచి మొబైల్ తీసుకొని... రోజూ ఆన్‌లైన్ క్లాసులు చదువుతోంది. ఓ రోజు తల్లి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఏదో మెసేజ్ వచ్చింది. అది రెడ్ కలర్‌లో కనిపిస్తుంటే... ఏంటా అని ఓపెన్ చేసింది. అవతలి నుంచి 20 ఏళ్ల కుర్రాడు... హాయ్ అని మెసేజ్ పంపాడు. ఏదో తెలియని ఆనందం. ఎవరో తెలుసుకుందామని ఈమె కూడా హాయ్ అని మెసేజ్ పంపింది. తను రఫీ అని పరిచయం చేసుకున్నాడు. తాను ఇరుక్కుర్‌కి చెందిన వాణ్ని అని చెప్పాడు. ఈ యువతి కూడా కన్నూర్‌కి చెందిన దాన్ని అనీ... తన పేరు ఇదీ అని వివరాలన్నీ చెప్పేసింది. ఇలా ఇద్దరి మధ్యా పరిచయం మొదలై... స్నేహంగా మారి... ఇంకొంచెం ముందుకెళ్లింది.

  ఓవైపు చదువు... మరోవైపు చాటింగ్ రెండూ సాగుతున్నాయి. రోజురోజుకూ తమ కూతురు... మొబైల్‌లో ఎక్కువ సేపు గడుపుతుంటే... బాగా చదువుతోంది అనుకున్నారు పేరెంట్స్. కానీ ఆ అమ్మాయి చదువు అటకెక్కుతూ... చాటింగ్ ఎక్కువైంది. ఓ రోజు నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నాక్కూడా అంది. ఎక్కడ కలుద్దాం అని అనుకున్నారు. ఓ ప్లేస్ చెప్పాడు. అంతే... ఆదివారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెక్కేసింది. కన్నూరు రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. సరదాగా తిరుగుదామా అంటూ... రైలెక్కించాడు.

  ఫ్రెండ్ ఇంటికి అంటూ వెళ్లిన అమ్మాయికి ఎంతకీ రాకపోవడంతో... యువతి ఫ్రెండుకి కాల్ చేసింది తల్లి. తను మా ఇంటికి రాలేదాంటీ అని చెప్పింది మరో అమ్మాయి. దాంతో... పేరెంట్స్‌కి టెన్షన్ మొదలైంది. మొబైల్‌లో చూస్తే... అప్పుడు అర్థమైంది ఈ చాటింగ్ జరిగిందని. అలర్టైన పేరెంట్స్... వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు... చాటింగ్‌లో అతని మొబైల్ నంబర్‌ని ట్రాక్ చేశారు. రైల్లో వెళ్తున్నట్లు అర్థమైంది. వెంటనే ఆ రైలు ఎటు వెళ్తుందో... ఆ స్టేషన్ల దగ్గర అలర్ట్ చేశారు. ఈ యువ జంట... కోయంబత్తూరులో రైలు దిగింది. అక్కడ ఆల్రెడీ అలర్టైన ఉన్న రైల్వే పోలీసులు ఆ జంటను పట్టుకున్నారు. యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

  విషయం తెలుసుకున్న పేరెంట్స్ హడావుడిగా వెళ్లి... అమ్మాయిని కాపాడుకున్నారు. ఇలా ఓ మైనర్‌ని ప్రేమ పేరుతో డ్రామాలాడి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు రాశారు. పోస్కో (POSCO) చట్టం కింద కూడా కేసు నమోదైంది.

  ఆ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. "ప్రేమించేవాడివే అయితే... కన్నూరులోనే ఆమెను అక్కడక్కడా తిప్పేవాడివి... ఇలా రైల్లో ఎత్తుకొస్తున్నావంటే... ఇది ప్రేమ ఎలా అవుతుంది. అయినా మైనర్‌ని ప్రేమిస్తే ఎలా... ఇది నేరం అని నీకు తెలియదా" అని పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అతన్ని తలిపారంబా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లగా... కోర్టు రిమాండ్ విధించింది. బాలికను మాత్రం పోలీసులు తల్లిదండ్రుల విజ్ఞప్తితో విడిచిపెట్టారు

  ఇది కూడా చదవండి: Zodiac signs: మంగళవారం పుడితే... ఈ పనులు చెయ్యొద్దు

  ఇదీ జరిగింది. పేరెంట్స్... మైనర్లైన పిల్లలు అడ్డదారిలో వెళ్తే... ఆ తప్పు వాళ్లది కాదు పేరెంట్స్‌దే అవుతుంది. కాబట్టి... వాళ్లు ఏ చదువుతున్నారో చూసుకోవాల్సిందే. ఈ లోకం గురించి వాళ్లకు అంతగా తెలియదు. ఎవరైనా నాలుగు తియ్యటి మాటలు చెబితే... నిజమే అని నమ్మేస్తారు విద్యార్థులు. వాళ్లను అలాంటి మోసగాళ్ల బారి నుంచి కాపాడుకోవాల్సింది పెద్దలే.
  Published by:Krishna Kumar N
  First published: