టిక్‌టాక్ పిచ్చి.. చివరికి అతన్ని ఇలా మార్చేసింది..

ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6గంటలకు జతిన్ ఛబ్రా ప్రీతి విహార్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి 20ఏళ్ల ఓ యువకుడు బైక్‌పై అక్కడికి వచ్చాడు. ఫోన్ కొనుగోలు చేసేందుకు తానే సంప్రదించానని చెప్పాడు. ఇద్దరి మధ్య కాసేపు ఫోన్‌కి సంబంధించిన సంభాషణ జరిగింది.

news18-telugu
Updated: June 17, 2019, 12:14 PM IST
టిక్‌టాక్ పిచ్చి.. చివరికి అతన్ని ఇలా మార్చేసింది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్‌టాక్.. యువతను ఉర్రూతలూగిస్తున్న ఓ క్రేజీ యాప్. రోజుకొక వీడియో అయిన టిక్‌టాక్‌లో పోస్ట్ చేయకపోతే కొంతమందికి నిద్ర కూడా పట్టదంటే అతిశయోక్తి కాదు. అంతలా యూత్ దీనికి ఎడిక్ట్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు 'టిక్‌టాక్' కోసం ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. అదేంటి.. టిక్‌టాక్ కోసం దొంగతనమేంటి అనుకుంటున్నారా..

వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఢిల్లీకి చెందిన జతిన్ ఛబ్రా అనే ఓ వ్యక్తి ఇటీవల తన ఐఫోన్-XS అమ్మాలనుకున్నాడు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మకానికి సంబంధించి ఇద్దరి మధ్య రూ.80వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రీతి విహార్ ప్రాంతంలో ఇద్దరు కలుసుకోవాలనుకున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6గంటలకు జతిన్ ఛబ్రా ప్రీతి విహార్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి 20ఏళ్ల ఓ యువకుడు బైక్‌పై అక్కడికి వచ్చాడు. ఫోన్ కొనుగోలు చేసేందుకు తానే సంప్రదించానని చెప్పాడు. ఇద్దరి మధ్య కాసేపు ఫోన్‌కి సంబంధించిన సంభాషణ జరిగింది.

మాటల మధ్యలో ఆ యువకుడు ఐఫోన్ తీసుకుని చెక్ చేస్తున్నట్టు నటించాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బైక్ స్టార్ట్ చేసి ఫోన్‌తో ఉడాయించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఛబ్రా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని త్వరగానే పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతను పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను టిక్‌టాక్‌లో రెగ్యులర్‌గా వీడియోలు చేస్తుంటానని.. దాని ద్వారా కొంత ఆదాయం కూడా సమకూరుతోందని చెప్పాడు. అయితే ఇటీవల తన ఫాలోవర్స్.. ఇంకా బెటర్ క్వాలిటీతో వీడియోలు చేయాలని కోరడంతో ఐఫోన్ దొంగతనానికి పాల్పడినట్టు చెప్పాడు. అతనిపై అంతకుముందు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పోలీసులు తెలిపారు. మొత్తం మీద టిక్‌టాక్ పిచ్చి అతన్నో దొంగలా మార్చిందని జనం చర్చించుకుంటున్నారు.

 

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు