హోమ్ /వార్తలు /క్రైమ్ /

మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడికి రూ.20 వేల జరిమానాతోపాటు..

మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడికి రూ.20 వేల జరిమానాతోపాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మూడున్నరేళ్ల పాపపై అత్యాచారానికి ఒడిగట్టిన నీచుడికి తాజాగా కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2018లో జరిగిన ఈ దారుణానికి గానూ నిందితుడికి 20వేల జరిమానాతోపాటు జీవితకాల జైలు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. నిర్భయ చట్టం వచ్చినా కీచకులు ఇంకా నిర్భయంగా అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. వయసుతో పనిలేకుండా ఆడపిల్లయితే చాలన్న రీతిలో కామాంధుతు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలను చేస్తున్నాయే తప్ప, వాటి అమలు విషయంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మూడున్నరేళ్ల పాపపై అత్యాచారానికి ఒడిగట్టిన నీచుడికి తాజాగా కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2018లో జరిగిన ఈ దారుణానికి గానూ నిందితుడికి 20వేల జరిమానాతోపాటు జీవితకాల జైలు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లాలో చిపబరోడ్ అనే గ్రామంలో జంకీలాల్ లోథా అనే 40 ఏళ్ల వ్యక్తి కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2018వ సంవత్సరంలో అదే గ్రామంలో ఓ మూడున్నరేళ్ల పాప, వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉండగా పక్కకు పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ పాపను పిల్లల వద్ద వదిలేశాడు. పాప ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు వచ్చి పరిశీలించారు. పాప మర్మాంగాల వద్ద రక్తం కారుతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు తేల్చారు. దీంతో అసలేం జరిగిందన్నది విచారించిన తల్లిదండ్రులు, లోథాను పట్టుకుని చితకబాదారు. పోలీస్ కేసు పెట్టారు.

2018 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శనివారం ఈ కేసునకు సంబంధించిన తుది తీర్పును కోర్టు వెల్లడించింది. 15 మంది సాక్ష్యులను విచారించిన అనంతరం తన తీర్పును ప్రకటించింది. లోథాకు 20వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా అతడు సాధారణ మరణం పొందేవరకు జైలు శిక్షను అనుభవించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అతడికి ఉరిశిక్ష పడితే ఇంకా సంతోష పడేవాళ్లమనీ, అలాంటి నీచుడికి బతికే హక్కులేదని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

First published:

Tags: Child rape, Crime news, Gang rape, Nirbhaya case

ఉత్తమ కథలు