Home /News /crime /

20 PEOPLE DIED IN BUS OIL TANKER CRASH IN PAKISTAN PUNJAB PROVINCE PVN

Bus-oil tanker crash : ట్యాంకర్ ని ఢీ కొట్టిన బస్సు..20మంది సజీవదహనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bus-oil tanker crash : ఏం జరిగిందో తెలిసేలోపే 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Bus-oil tanker crash : పాకిస్తాన్(Pakistan)​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ప్రయాణికులతో లాహోర్​ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు... పంజాబ్ రాష్ట్రం ముల్తాన్​ లో ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొట్టింది(Bus-Oil Tanker Crash). వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు వాహనాల్ని దహించివేశాయి. ఏం జరిగిందో తెలిసేలోపే 20 మంది సజీవ దహనం అయ్యారు(20 People Burnt Alive). మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎన్​ఏ పరీక్షల ఆధారంగానే వారు ఎవరో నిర్ధరించిన తర్వాతే కుటుంబసభ్యులకు మృతదేహాలు అందజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు ప్రయాణికుల్ని ముల్తాన్​ లోని నిస్తార్ హాస్పిటల్ కు తరలించామని..అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని పాకిస్థాన్​ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేసు నమోదు చేసుకుని అసలైన కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా,ఈ ప్రమాదఘటన తర్వాత రోడ్డుపై చాలా గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాద ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఎలాహీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. మృతదేహాలు వారి కుటుంబసభ్యులకు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.



Indian Plane : అసలేం జరిగింది? అకస్మాత్తుగా పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం!

పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతున్నాయి, నాసిరకం మౌలిక సదుపాయాలు, శిథిలావస్థలో ఉన్న వాహనాలు, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతుంది. గత శనివారం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లోడుతో కూడిన ట్రక్కు ప్రయాణీకుల బస్సును ఢీకొనడంతో 13 మంది మరణించిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, Road accident

తదుపరి వార్తలు