హోమ్ /వార్తలు /క్రైమ్ /

Dogs Attack: రెచ్చిపోతున్న గ్రామ సింహాలు.. కుక్క‌ల దాడిలో 20 మేక పిల్ల‌లు మృతి..

Dogs Attack: రెచ్చిపోతున్న గ్రామ సింహాలు.. కుక్క‌ల దాడిలో 20 మేక పిల్ల‌లు మృతి..

మేకలు, పశువుల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్నామని.. కుక్కలు దాడి చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్ర‌భుత్వం స్పందించి తమకు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని వేడుకుంటున్నారు.

  గ్రామాల్లో రోజురోజుకూ గ్రామసింహాలు రెచ్చిపోతున్నాయి. గ‌త నెల రోజుల్లోనే మూడు సార్లు కుక్క‌లు దాడి చేసి 41 గొర్రెలు, మూడు దూడ‌లను పొట్టన పెట్టుకోగా... తాజాగా 20 మేక పిల్ల‌ల‌ను కూడా దాడి చేసి చంపేశాయి. దీంతో గొర్రెలు, మేకల పెంప‌కందారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కుక్క‌ల నివార‌ణ‌కు గ్రామ పంచాయితీలు చర్య‌లు తీసుకోవాల‌ని బాధితులు కోరుతున్నారు.

  నిజామాబాద్ జిల్లాలో గడిచిన నెలరోజుల్లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ముడు సార్లు కుక్కుల దాడులు జరిగాయి. గ‌త నెల 14న‌ రెంజ‌ల్ మండ‌ల‌ కేంద్రానికి చెందిన భూమేష్, గంగాధర్ తమ ఇంటి సమీపంలో గొర్రెలమంద ను ఏర్పాటు చేశారు. మంద చుట్టూ వ‌ల‌లతో రక్షణ కల్పించి ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో కుక్కలు వ‌ల‌ పై నుంచి దూకి గొర్రెల‌ పైన దాడి చేశాయి. ఈ దాడిలో 41 గొర్రెలు మృతి చెందాయి. అంతేగాక జనవరి 21 న‌ డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ గ్రామంలో శునకాల దాడిలో ముగ్గురు రైతులకు చెందిన మూడు దూడ‌లు మృతి చెందాయి. దీంతో పాడి గేదెలు పాలు ఇవ్వ‌డం లేదని పాడిరైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  తాజాగా క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌లం హాసాకొత్తూర్ లో బుధ‌వారం రాత్రి కుక్క‌లు దాడి చేయ‌డంతో 20 మేక‌పిల్ల‌లు మృతి చెందాయి. రెబ్బ‌సి పెద్ద ముత్తెన్న 20 మేకపిల్ల‌లను కొట్టంలో ఉంచి మేక‌ల మేత‌కు వెళ్లాడు. తిరిగి చీక‌టిప‌డ్డ త‌రువాత మేక‌ల‌ను తీసుకుకోని వ‌చ్చాడు. అప్ప‌టికే మేక పిల్ల‌లు మృతి చెంది క‌నిపించాయి. దీంతో ముత్తెన్న కన్నీటి ప‌ర్యంతం అయ్యాడు. ఘటనాస్థలంలో మృతి చెందిన మేక పిల్ల‌ల‌ను ప‌శు వైద్యాధికారులు పరిశీలించారు.

  మేకలు, పశువుల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్నామని.. కుక్కలు దాడి చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్ర‌భుత్వం స్పందించి తమకు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని వేడుకుంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఇప్ప‌టికైనా గ్రామపంచాయితీ అధికారులు కుక్క‌ల నివార‌ణ‌కు తగు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కుక్కలను నియంత్రించకుంటే తమ గ్రామాల్లో పశువులకు ప్రాణాపాయమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  First published:

  Tags: Crime, Crime news, Dog, Nizamabad, Stray dogs, Stray dogs attack, Telangana

  ఉత్తమ కథలు