Home /News /crime /

20 DEAD IN SOUTH AFRICAN NIGHTCLUB PROBE ON PAH

నైట్‌క్లబ్‌లో పెను విషాదం.. 20 మంది యువత అనుమానాస్పద మృతి.. అప్రమత్తమైన అధికారులు..

ఆస్పత్రి ముందు వేచి ఉన్న తల్లిదండ్రులు

ఆస్పత్రి ముందు వేచి ఉన్న తల్లిదండ్రులు

South africa: దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్‌లో ఊహించని సంఘటన జరిగింది. సీనరీ పార్క్‌లోని నైట్ క్లబ్ లో 20 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు.

దక్షిణాఫ్రికాలో పెను విషాద ఘటన సంభవించింది. దక్షిణ ఆఫ్రికాలోని తూర్పు లండన్‌లోని టౌన్‌షిప్‌లో తాత్కాలిక నైట్‌క్లబ్‌ లో (South African Nightclub Probe) 20 మంది యువత అనుమానస్పదంగా మరణించారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. కాగా, జోహన్నెస్‌బర్గ్‌కు దక్షిణంగా దాదాపు 1,000 కిమీ (620 మైళ్లు) దూరంలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న నగరంలోని క్లబ్ వెలుపల ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే చనిపోయిన వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. క్లబ్ బయట నిరసనలు చేపట్టారు.

ఎగ్జామ్ లు ముగిసాక.. ఆనందంతో వారంతా పార్టీలు చేసుకొవడానికి క్లబ్ కు వచ్చినట్లు సమాచారం. ఈస్ట్ లండన్‌లో ఉన్న సీనరీ పార్క్‌లోని స్థానిక చావడిలో 17 మంది (ప్రజలు) మరణించినట్లు నివేదిక వచ్చిందనిన అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ థెంబింకోసి కినానా తెలిపారు. బాధితులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు. అదే విధంగా వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు.

దీంతో అధికారులు ఘటన ఎలా జరిగుంటుందో అని అక్కడి సీసీ కెమారాలను పరిశీలిస్తున్నారు. తొలుత 17 మంది చనిపోయారు. తాజాగా, ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్య 20 కి చేరింది. మొత్తం ఎంత మంది ఉన్నారన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ దేశంలో.. తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.

ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, South Africa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు