హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire accident: ఉలిక్కిపడిన ఢిల్లీ.. 20 మంది అగ్నికి ఆహుతి.. 30 మందికి తీవ్ర గాయాలు..

Fire accident: ఉలిక్కిపడిన ఢిల్లీ.. 20 మంది అగ్నికి ఆహుతి.. 30 మందికి తీవ్ర గాయాలు..

ఎగిసి పడుతున్న మంటలు

ఎగిసి పడుతున్న మంటలు

Delhi: ఢిల్లీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిముషాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ లో (Mundka metro station)  సమీపంలోని కాంప్లెక్స్ లో మంటలు వ్యాపించాయి. దీంతో నిముషాల వ్యవధిలోనే అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి తో ఆ ప్రాంతంతో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 20కి పైగా ఫైర్ ఇంజన్ లు సంఘటన స్థలం వద్ద మంటలను (Fire accident) ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా స్థానికులను అధికారులు వేరే ప్రాంతాలకు తరలించారు.

ఇప్పటి వరకు భవనం నుంచి 20 మృత దేహలను (Dead bodies) బయటకు తీసినట్లు అధికారులు గుర్తించారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారని, వారిని అంబూలెన్స్ లో సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. భవనంలో ఉన్న సుమారు 70 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే..  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా బాధితుల రోదనలతో తీవ్ర విషాదకరంగా మారింది.

జమ్ములోని కత్రాలో బస్సు అగ్నికి ఆహుతైంది.

జమ్ములోని వైష్ణోదేవి (Vaishno Devi ) అమ్మవారిని దర్శించుకొవడానికి భక్తులు కత్రా నుంచి బస్సులో (Bus accident) జమ్ముకు బయలు దేరారు. ఈ క్రమంలో కత్రాకు 1.5 కిలో మీటర్ల దూరంలో బస్సు ఖర్మల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు ఇంజిన్ లో మంటలు (Fire accident) వ్యాపించాయి. అవి వేగంగా బస్సును చుట్టు ముట్టాయి. బస్సులో ఉన్న నలుగురు కాలిబూడిదయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్ లోను అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా.. బస్సు.నెం.JK14/1831 కత్రా నుండి 1 కి.మీ దూరంలో మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Delhi, Fire Accident

ఉత్తమ కథలు