అత్తారింట్లో అదనపు కట్నం ప్రస్తావన. గన్ తీసుకొని కోడలు ఏం చేసిందంటే..

రాధిక (File Image)

అసలు ఆమె ఇలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అచ్చం తెలుగు లోని అతడు సినిమా గుర్తొచ్చేలా చేసిందామె. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అందరిలోనూ అదే అయోమయం. ఏమైందో తెలుసుకుందాం.

 • Share this:
  ఓ షాకింగ్ ఘటన... ఉత్తరప్రదేశ్... హర్దోహీలో జరిగింది. అక్కడి ఖటజ్‌మాల ఏరియాలోని ఓ ఇంట్లో రెండేళ్ల కిందట కొత్త కోడలిగా అడుగుపెట్టింది రాధిక. ఇంట్లో వాళ్లంతా ఆమెను ఆప్యాయంగా చూసుకున్నారు. ఈమధ్య... ఏదో సందర్భంలో... కట్నం మరికొంత ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేదని అబ్బాయి తండ్రి (మావయ్య) అన్నారు. ఇంట్లో వాళ్లంతా ఆ మాటను సమర్థించారు. అలాగని వధువును వాళ్లేమీ ఇబ్బంది పెట్టలేదు. క్యాజువల్‌గానే అన్నారు. రోజూ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడే రాధిక... ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో... ఆమె తల్లిదండ్రులు ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆల్రెడీ చాలా కట్నం ఇచ్చామనీ... ఇంకా అడగటమేంటని ఆమె బాధపడింది. ఇటు రాధిక... మరేం పర్లేదులే... నన్నేమీ ఫోర్స్ చెయ్యలేదు. నువ్వేం కంగారుపడకు అని ధైర్యం చెప్పింది.

  మర్నాడు మధ్యాహ్నం 2 గంటలైంది. ఇంట్లో బూజు దులుపుతూ... అతడు సినిమాలో లాగే... ఓ మూల గదిలోకి వెళ్లింది రాధిక. అక్కడ రాజుల కాలం నాటి వస్తువుల లాంటివి ఏవో కనిపించాయి. ఇవేంటి ఇలా ఉన్నాయి. వీటి గురించి నాకెప్పుడూ చెప్పలేదే... ఏంటో ఇవి... అనుకుంది. అక్కడో గన్ ఉండటం చూసింది. అదో నాటు తుపాకీ. అరే... ఇది భలే ఉందే... మా అత్తారింట్లో... గన్ ఉందా... అసలు దీనికి లైసెన్స్ ఉందో లేదో... అనుకుంది. ఇలాంటి గన్‌తో సెల్ఫీ తీసుకుంటే... అనుకుంది... వెంటనే మొబైల్ తెచ్చుకొని... సెల్ఫీ తీసుకుంటూ... మొబైల్ కెమెరా బటన్ నొక్కబోయి... గన్ ట్రిగ్గర్ నొక్కింది. అంతే... బుల్లెట్ మెడలోకి దూసుకెళ్లింది. గట్టిగా అరుస్తూ వధువు నేలపై పడింది. మెడ నుంచి రక్తం... ప్రవాహంలా బయటకు చిమ్ముకొచ్చింది.

  కుటుంబ సభ్యులంతా పరుగెత్తుకొచ్చి... విషయం తెలుసుకొని... వెంటనే ఆమెను. షహబాద్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు నమ్మలేదు. అదనపు కట్నం కోసమే అమ్మాయిని మీరే చంపేశారు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు పోస్ట్‌మార్టం కోసం డెడ్ బాడీని తరలించారు. ఆ తర్వత కేసు రాశి... భర్త అకాష్, మావయ్య రాజేష్, అత్తగారు పూనమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.2 లక్షల అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని టార్చర్ చేసి చివరకు చంపేశారని తలలు బాదుకుంటూ ఏడ్చారు రాధిక తల్లిదండ్రులు.

  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారనీ... తాము ఆమెను ఏమీ అనలేదని భర్త ఆకాష్ అంటున్నారు. ఫోరెన్సిక్ టీమ్... గన్‌ను, మొబైల్‌ను ల్యాబ్‌కి తీసుకెళ్లింది.

  ఇది కూడా చదవండి: విద్యార్థినిపై కన్నేసిన స్పోర్ట్స్ టీచర్. మొబైల్‌లో నగ్న ఫొటోలు చూపిస్తూ...

  గన్ ఎక్కడిది?
  ఈ కేసులో గన్ ఎక్కడిది అనే ప్రశ్న తలెత్తింది. ఘటన జరిగిన గంట కిందటే ఆ గన్‌ను పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చినట్లు ఆకాష్ చెప్పాడు. అది లైసెన్స్ ఉన్న గన్నే. ఆమధ్య పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ఎన్నికలు ముగిసిపోవడంతో... దాన్ని తిరిగి ఇంటికి తెచ్చాడు. ఐతే... దాన్ని సీక్రెట్‌గా మూల గదిలో ఉంచాడని తెలిసింది. ఐతే... పోలీసులు ఏమంటున్నారంటే... ఆ గన్‌తో భార్య, భర్త ఇద్దరూ సెల్ఫీలు తీసుకుంటుండగా... అది మిస్ ఫైర్ అయ్యిందని అంటున్నారు. అనుకోకుండా జరిగింది అన్నట్లు మాట్లాడుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుంది అంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: