భారీగా రద్దైన పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు స్వాధీనం

రద్దైన పాత రూ.1000ల కరెన్సీ నోట్లు 13,432, అలాగే రద్దైన పాత రూ.500ల కరెన్సీ నోట్లు 43,300 స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక క్రైం బ్రాంచ్‌కి చెందిన దర్యాప్తు అధికారి శైలేష్‌గిరి గోస్వామి మీడియాకి తెలిపారు.

news18-telugu
Updated: February 11, 2019, 10:46 AM IST
భారీగా రద్దైన పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు స్వాధీనం
రద్దైన రూ.1000ల కరెన్సీ నోట్లు
news18-telugu
Updated: February 11, 2019, 10:46 AM IST
దేశంలో రూ.500, రూ.1000 పాత పెద్ద నోట్లను రద్దు చేసి రెండేళ్లు గడిచిపోయింది. తాజాగా గుజరాత్‌లో రద్దైన పాత కరెన్సీ నోట్లను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకోవడం కలకలంరేపుతోంది. నవ్‌సారి జిల్లాలోని బిలిమోరా గ్రామంలో దాదాపు రూ.3.5 కోట్ల విలువైన రద్దైన పాత కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

రద్దైన పాత రూ.1000ల కరెన్సీ నోట్లు 13,432, అలాగే రద్దైన పాత రూ.500ల కరెన్సీ నోట్లు 43,300 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక క్రైం బ్రాంచ్‌కి చెందిన దర్యాప్తు అధికారి శైలేష్‌గిరి గోస్వామి మీడియాకి తెలిపారు. రూ.3.5 కోట్ల విలువచేసే రద్దైన కరెన్సీ నోట్లను ఓ కారులో తరలిస్తుండగా తనఖీలు చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

నల్లధనం, అవినీతిని నిర్మూలించే ఉద్దేశంతో 2016 నవంబరు 8న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...