హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: వామ్మో.. ఇదేంట్రా బాబు... 181 కొకైన్ క్యాప్సుళ్లను మహిళలు ఎక్కడ దాచారో తెలుసా..?

OMG: వామ్మో.. ఇదేంట్రా బాబు... 181 కొకైన్ క్యాప్సుళ్లను మహిళలు ఎక్కడ దాచారో తెలుసా..?

కొకైన్ క్యాప్సుల్స్

కొకైన్ క్యాప్సుల్స్

Delhi Airport: ఇద్దరు మహిళల ప్రవర్తన అనుమానస్పదంగా ఉంది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. ఇద్దరిని ప్రత్యేక పరికరంతో స్కాన్ చేశారు.

ఎయిర్ పోర్టులో తరచుగా స్మగ్లర్ లు నిషేధిత పదార్థాలను రవాణా చేస్తుంటారు. వీరు పోలీసుల నుంచి తప్పించుకొవడానికి రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. ప్రధానంగా, డ్రగ్స, బంగారం ను (Drugs and gold) అనేక పద్ధతులలో రవాణా చేస్తుంటారు. కొందరు వీటిని పాదంలో ఉంచుకుంటారు. మరికొందరు లోదుస్తుల్లో, బ్రాలలో పెట్టుకుని రవాణా చేస్తుంటారు. ఇంకొన్ని సార్లు.. కడుపులోను, మూత్రం ప్రదేశంలోను బంగారం లేదా డ్రగ్స్ పొట్లాలు పెట్టుకుని రవాణా చేస్తుంటారు. అయితే, వీరిని చాలా ఎయిర్ పోర్టు సిబ్బంది పరిశీలించి అరెస్టు చేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ ను (Indira gandhi International Airport) అక్రమంగా తరలిస్తున్న గ్యాంగ్ ను గుర్తించారు. ఎయిర్ పోర్టు సిబ్బంది ఇద్దరు మహిళల ప్రవర్తన అనుమానంగా ఉండటంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు. వారిని అదుపులోనికి తీసుకుని స్కాన్ చేయగా కడుపులో ఏదో క్యాప్సుల్ ఉండటం కన్పించింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

మహిళల కడుపులో 181 కొకైన్ క్యాప్సుల్స్ (Cocaine Capsules) ఉన్నట్లు డాక్టర్ ల స్కాన్ లో బయటపడింది. వెంటనే వైద్యులు ఆపరేషన్ తీసి బైటకు తీశారు. మహిళలు ఇద్దరు ఉగాండ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొకైన్ క్యాప్సుల్స్ 2 కిలోల బరువును కల్గి ఉంది. దీని ఖరీదు దాదాపు 28 కోట్లని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కొందరు స్మగ్లర్ లు అడవిలో ఎర్రచందనం కలపను దొంగతనం చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పోలీసుల కళ్ళు హప్పేందుకు నూతన మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఎవరు ఊహించని రీతిలో అంబులెన్స్ లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 15 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు కోటి రూపాయల విలువ గల 71 ఎర్రచందనం దుంగలు మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు వేలూరు రోడ్డులోని మాపాక్షి మలుపు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. అట్టు వైపుగా వస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణాను గుర్తించి అంబులెన్స్ లో ఉన్న ఎనిమిది మంది ఎర్రచందనం కూలీ లతో పాటుగా.. ఇద్దరు మేస్త్రీలు ఒక డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ.50 లక్షల విలువ చేసే 36 ఎర్రచందనం దుంగలతో పాటు అంబులెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Delhi Airport, Smuggling

ఉత్తమ కథలు