యూపీలో వరుస ఎన్‌కౌంటర్లు.. వికాస్ దుబే మరో ఇద్దరు అనుచరులు హతం

నేపాల్‌కు పారిపోయేందుకు వికాస్ దుబే ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇండియా-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

news18-telugu
Updated: July 9, 2020, 10:01 AM IST
యూపీలో వరుస ఎన్‌కౌంటర్లు.. వికాస్ దుబే మరో ఇద్దరు అనుచరులు హతం
నేపాల్‌కు పారిపోయేందుకు వికాస్ దుబే ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇండియా-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్‌లో కాల్పుల మోత మోగుతోంది. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే కోసం గాలిస్తున్న క్రమంలో.. వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబే ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. మరో ఇద్దరు అనుచరులను పోలీసులు కాల్చిచంపారు. ఎట్వా ప్రాంతంలో బహువా దుబేను ఎన్‌కౌంటర్ చేశారు. మరో అనచరుడు ప్రభాత్ మిశ్రా కూడా చనిపోయాడు. ఐతే అతడిని ఎక్కడ ఎన్‌కౌంటర్ చేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది.

బుధవారం ఫరిదాబాద్ సమీపంలో వికాస్ దుబే అనుచరుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారిలో ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఎట్వా ప్రాంతంలో బహువా దుబేను ఎన్‌కౌంటర్ చేశారు. అతడి వద్ద నుంచి డబుల్ బ్యారెల్ గన్, క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే కోసం యూపీ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నేపాల్‌కు పారిపోయేందుకు దుబే ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో.. మరింత అప్రమత్తమయ్యారు. ఇండియా-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియా నుంచి నేపాల్‌లోకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వికాస్ దూబె‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి పైకప్పు నుంచి పోలీసులపైకి దాడి చేశారు.

ఐతే కొందరు పోలీసులు వికాస్ దూబెకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని బుధవారం యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 8:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading