Home /News /crime /

ఆ కారణంతో అక్కాచెల్లెళ్లను కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు.. వీళ్లసలు మనుషులేనా..?.. Video

ఆ కారణంతో అక్కాచెల్లెళ్లను కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు.. వీళ్లసలు మనుషులేనా..?.. Video

(Image-Twitter)

(Image-Twitter)

ఇద్దరు అక్కాచెల్లెళ్లను వారి కుటుంబ సభ్యులే అతి దారుణంగా హింసించారు. గత నెలలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అత్తింటి నుంచి వచ్చి బంధువు ఇంట్లో ఓ మహిళను కుటుంబ సభ్యులు చెట్టుకు వేలాడదీసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను వారి కుటుంబ సభ్యులే అతి దారుణంగా హింసించారు. గత నెలలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఇద్దరు యువతులకు కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. వారిని కాళ్లతో తంతూ, కర్రలతో కొడుతూ దారుణంగా హింసించారు. మహిళ కిందపడిపోయిన పట్టించుకోకుండా మానవత్వం మరించి ప్రవర్తించారు.

    ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. పిపాల్వా గ్రామానికి చెందిన 19, 20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాధితురాళ్లను జూన్ 22వ తేదీన వారి బంధువులు కొట్టారని తాండా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి విజయ్ వాస్కలే తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాము 25వ తేదీన చూశామని చెప్పారు. ఆ వీడియోను ధ్రువీకరణ కోసం ప్రయత్నించిన సమయంలో.. బాధితురాళ్లను కొట్టింది వారి బంధువులేనని తేలిందన్నారు. యువతులు తమ మామ కొడుకుతో ఫోన్ మాట్లాడుతున్నందుకు కోపం పెంచుకున్న కొందరు కుటుంబ సభ్యులు ఈ దాడి చేసినట్టుగా తెలిసిందని చెప్పారు. ఇక, తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని బాధితురాళ్లు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.





    ఇక, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సందీప్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  బాధితురాళ్లలో ఒకరిని నలుగురు వ్యక్తులు హింసిస్తున్న వీడియో అది. ఆ వీడియో.. నిందితులు యువతిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ కనిపించారు. చేతుల్లో ఉన్న కర్రలు విరిగేవరకు యువతిపై అమానుషంగా దాడి చేశారు. యువతిని జట్టును పట్టుకుని కూడా లాక్కెళ్లారు. ఆమె నొప్పి తాళలేక కేకలు పెట్టిన వినిపించుకోలేదు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వెంబడించి మరి దాడి చేశారు. అయితే అక్కడ మరికొందరు ఉన్నప్పటికీ సాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. వారంతా ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయారు. ఇక, ఈ వీడియో వైరల్‌గా మారడంతో నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా మంది కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Madhya pradesh, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు