2 TERRORISTS INCLUDING LET COMMANDER KILLED 3 SOLDIERS INJURED DURING ENCOUNTER IN BARAM PVN
Baramullah Encounter : కశ్మీర్ లో ఉగ్రవాదులకు చుచ్చుపోయిస్తున్న సైన్యం
ప్రతీకాత్మక చిత్రం
Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. తాజాగా బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ సహా
Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. తాజాగా బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర గురువారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి బరాముల్లా(Baramullah) జిల్లాలోని మల్వా ఏరియాలో గాలింపు చేపట్టారు.
ఈ తరుణంలో ఉగ్రవాదులు(Terrorists) కాల్పులకు దిగడంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బుద్గాం జిల్లాలో ఎస్పీవో, అతని సోదరుడు, సాధారణ పౌరులను చంపడంలో హతమైన లష్రే కమాండర్ పాత్ర ఉందని కశ్మీర్ పోలీసు ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని చెప్పారు. వారిని హాస్పిటల్ కు తరలించామని, ప్రస్తుతం వారి క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.