పిడుగు బాధితులను పేడతో కప్పి చికిత్స.. మూఢనమ్మకానికి ఇద్దరు బలి

భారీ ఉరుములతో చెట్టుపై పిడగు పడడంతో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, పేడతో కప్పేశారు స్థానికులు. కాళ్ల నుంచి మెడ వరకు పేడలో పూడ్చారు.

news18-telugu
Updated: June 29, 2020, 5:02 PM IST
పిడుగు బాధితులను పేడతో కప్పి చికిత్స.. మూఢనమ్మకానికి ఇద్దరు బలి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చంద్రుడిపైకి రాకెట్లు పంపే ఈ కంప్యూటర్ యుగంలోనూ.. అంధ విశ్వాసాలు జడలు విప్పుతున్నాయి. అధునాత వైద్య వ్యవస్థ ఉన్న హైటెక్ కాలంలోనూ.. మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. పాతకాలం పద్దతులను ఇప్పటికీ గుడ్డిగా అనుసరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజనులు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు ఎక్కువగా ఉండే జశ్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. పిడుగుపాటుకు గురైన వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. పేడలో పూడ్చి చికిత్స అందించారు. దాంతో పరిస్థితి విషమించి ఇద్దరు మరణించారు. గ్రామస్తుల అంధ విశ్వాసానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జశ్‌పూర్ జిల్లా బాగ్‌బహర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో సునిల్ సాయి (22), చంపా రౌత్ (20)తో పాటు మరో యువకుడు పొలంలో పనిచేసుకుంటున్నారు. వర్షం పడడంతో ఆ ముగ్గురూ ఓ చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. ఐతే భారీ ఉరుములతో చెట్టుపై పిడగు పడడంతో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, పేడతో కప్పేశారు స్థానికులు. కాళ్ల నుంచి మెడ వరకు పేడలో పూడ్చారు. అలా చేస్తే కాలిన గాయాలు నయమవుతాయని వారి నమ్మకం.

ఆ తర్వాత కాసేపటికి కొందరు యువకులు వచ్చి గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులను వారించారు. హుటాహుటిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే సునీల్ సాయి, చంపా రౌత్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. మరో యువకుడిని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: June 29, 2020, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading