2 Minor girls allegedly gang raped : స్మార్ట్ ఫోన్లు ఇప్పుుడు అందరి జీవితంలో భాగమైపోయాయి. ధనిక, పేద,చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంతా సంతోషిస్తున్నారు. అదే సమయంలో నాణెనికి మరోవైపు ఉన్నట్లే స్మార్ట్ ఫోన్ల వల్ల ప్రయోజనాలే కాదు నేరాలు, ఘోరాలూ జరిగిపోతున్నాయి. ఫోన్ లో చూడకూడనివి చూసేస్తున్నారు. ఆ తర్వాత నేరాలకు, ఘోరాలకు తెగబడుతున్నారు. బీహార్ లో అలాంటి దారుణం ఒకటి జరిగింది. మొబైల్ లో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఐదుగురు టీనేజర్లు దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయి ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు.
బీహార్ లోని షేక్ పుర జిల్లాలోని బార్బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు టీనేజర్లు.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మైనర్ బాలికల్లో ఒకరు ప్రభుత్వ స్కూల్ లో 6వ తరగతి, మరొకరు 7వ తరగతి చదువుతున్నారు. బాలికలు పొలం పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బాలికలిద్దరూ తమ ఇళ్లకు వెళ్లారని చెప్పారు. అందులో ఒకరి ఆరోగ్యం క్షీణించిందని, కుటుంబ సభ్యులు అడిగేసరికి బాలిక విషయం చెప్పిందని వివరించారు. బాలికల నాయనమ్మ ఈ విషయంపై తమకు సమాచారం అందించిందని..నిందితులిద్దరినీ పట్టుకున్నామని.. విచారణలో ఇద్దరూ నేరం అంగీకరించారని తెలిపారు. పోర్న్ వీడియోలు చూసి ఇలా చేశామని నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు 6వ తరగతి, ఒకరు 7వ తరగతి, మరొకరు 8 తరగతి చదువుతున్నారని చెప్పారు.
ALSO READ Oil Import : రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై అమెరికా, బ్రిటన్ బ్యాన్
బాధిత బాలికలను మహిళా పోలీసులు విచారించగా..ఐదారుగురు కలిసి తమపై ఈ దారుణానికి పాల్పడ్డారని బాలికలు చెప్పారు. ఈ సమయంలో ఇద్దరూ ఏడవడాన్ని చూసి నిందితులు చెరో ఐదు రూపాయలు ఇచ్చారని... ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని బాలికలు చెప్పారని పోలీసులు తెలిపారు. బాలికలిద్దరినీ వైద్య పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం జువైనల్ జస్టిస్ బోర్డు కస్టడీలో ఉన్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన చెలరేగింది. చుట్టుపక్కల గ్రామాలకూ ఈ వార్త వెంటనే వ్యాపించిందని పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై వివాదం చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Gang rape, Minor rape