కొన్ని సార్లు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నిముషాల వ్యవధిలోనే పరిస్థితులు అంతా ఒక్కసారిగా తారుమారైపోతుంటాయి. కొన్ని సార్లు, వాహానాలను అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు (Road accident) జరుగుతుంటాయి. మరికొన్ని సార్లు.. రోడ్డు ఇరుకుగా ఉండి, వాహానాల బ్రేకులు ఫెయిల్ కావడం వలన ప్రమాదాలు జరుగుతాయి. కొందరు తాగి వాహనాలను నడిపి యాక్సిడెంట్ లు చేస్తుంటారు. వారు ప్రమాదాలలో పడటమే కాకుండా తోటి ప్రయాణికులను కూడా ప్రమాదాల్లో నెట్టేస్తారు. కొన్ని సార్లు అనుకొకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వారు మానవత్వంతో వాహనాన్ని ఆపి, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుంటారు.
తమ మానవత్వాన్ని చాటుకుంటారు. మరికొందరు మాత్రం.. రోడ్డుపైన పొరపాటున యాక్సిడెంట్ జరిగితే అసలు పట్టించుకోరు. నాకేం అన్నట్లు మాయమైపోతుంటారు. అయితే, కొందరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. మనుషులనే కాదు.. తమవలన అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే వారిని కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు. తప్పించుకొవడానికి ప్రయత్నించరు. ఈ క్రమంలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు జరుగుతాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY
— Singh Varun (@singhvarun) June 10, 2022
పూర్తి వివరాలు.. ముంబై (Mumbai) లోని బాంద్రా వర్లీ సీ లింక్‌లో మార్గమధ్యంలో ఈ ఘటన మే 30 న జరిగింది. కాగా, తన కారులో అమర్ మనీష్ జరీవాలా అనే వ్యాపార వేత్త మలాడ్ వైపు వెళ్తున్నారు. అప్పుడు ఒక పక్షి వారి కారును ఢీకొట్టింది. దీంతో అది కింద పడింది. వారు వంతెన మీదనే రోడ్డుపక్కన కారును ఆపారు. దానికి సపర్యలు చేశారు. దాని ప్రాణాలు కాపాడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన మరో టాక్సీ రోడ్డు మీద ఉన్న వ్యాపారవేత్త జరీవాలాను, అతని డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరు గాలిలో బంతిలాగా ఎగిరి కింద పడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలోనే జరివాల మరణించాడు. కామత్ అనే డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అజాగ్రత్తగా వాహనం నడిపి ఇద్దరు చనిపోవడానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ జైశ్వర్ (30) గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Mumbai, Road accident, Viral Video