పోలీస్‌లను తాకిన ‘మీటూ’ మూమెంట్... 25 మంది మహిళా హోంగార్డుల ఫిర్యాదు

యూనిఫాం సరిచేస్తున్నామంటూ ఇష్టం వచ్చిన చోట తాకుతూ రాక్షస ఆనందం పొందారు... ట్రాన్సఫర్ కోసం వెళితే కోరిక తీర్చాలని వేధించారు... సూరత్ పోలీస్ కమిషనర్‌ సతీశ్ శర్మకు నాలుగు పేజీల ఫిర్యాదు అందించిన 25 మంది మహిళా హోంగార్డులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 7, 2018, 1:06 PM IST
పోలీస్‌లను తాకిన ‘మీటూ’ మూమెంట్... 25 మంది మహిళా హోంగార్డుల ఫిర్యాదు
‘మీటూ’ మూమెంట్ నమూనా చిత్రం
  • Share this:
సినీ రంగంతో పాటు మీడియా, రాజకీయ, క్రీడారంగాలను షేక్ చేస్తున్న ‘మీటూ’ మూమెంట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌నూ తాకింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో 25 మంది మహిళా హోంగార్డులు, ఇద్దరు ఉన్నతాధికారులపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రక్షణ శాఖలోనూ ‘మీటూ’ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సూరత్‌లో విధులు నిర్వహిస్తున్న తమపై ఇద్దరు హోంగార్డు ఉన్నతాధికారులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ 25 మంది మహిళా హోంగార్డులు పోలీస్ కమీషనర్ సతీశ్ శర్మకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ట్రాన్సఫర్ కోసం పైఅధికారులను సంప్రదించిన పైఅధికారులను సంప్రదించిన సమయంలో కోరిన చోటుకి బదిలీ కావాలంటే డబ్బులు ముట్టజెప్పాలని, లేదంటే తమ కోరిక తీర్చాలని వేధించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా హోంగార్డులు. అంతేకాకుండా యూనిఫాం సరిచేస్తున్నామంటూ ఇష్టం వచ్చిన చోట తాకుతూ, రాక్షస ఆనందం పొందారని కమిషనర్‌కు వివరించారు. హోంగార్డుల నుంచి 4 పేజీల ఫిర్యాదుని స్వీకరించిన పోలీస్ కమిషనర్‌ సతీశ్ శర్మ... విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హైంగార్డ్ ఉన్నతాధికారులిద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

First published: November 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>