Home /News /crime /

2 DEAD AS EARTHQUAKE JOLTS INDONESIA SUMATRA PVN

Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం..సింగపూర్, మలేషియాల్లో సైతం కదిలిన బిల్డింగ్ లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Earthquake In Indonesia :    ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8:39 గంటల సమయంలో సుమత్ర ద్వీపంలో భూమి భారీగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake In Indonesia :    ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8:39 గంటల సమయంలో సుమత్ర ద్వీపంలో భూమి భారీగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయడం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​ మీద భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు యూఎస్​ జియోలాజికల్​ సర్వే తెలిపింది. పశ్చిమ సుమత్ర ప్రావిన్స్‌ లోని బుకిటింగ్గి పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ద్వీపం యొక్క ఉత్తరాన 12 కిలోమీటర్ల (7.5 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం ధాటికి పక్కనే ఉన్న సింగపూర్, మలేషియాల్లో సైతం బిల్డింగ్లు కదిలిపోయాయి. అయితే సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు చెప్పారు.

ఈ ఘటనలో ఇద్దరు మరణించగా..పలువురు గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ హెడ్ ఏజెన్సీ (BNPB)హెడ్ సుహర్యాంటో ప్రకారం.. భూకంప కేంద్రం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ పసమన్‌ లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పసమన్ నగరంలో ఇటుకలు నేలపై పడి ఉన్న మరియు గోడలకు రంధ్రాలతో పాక్షికంగా కూలిపోయిన ఇళ్ళు దర్శనమిస్తున్నాయి. పట్టణ మేయర్ నివాసం కూడా నేలపై అద్దాలు పగిలిపోవడంతో దెబ్బతిన్నట్లు సుహర్యాంటో తెలిపారు. ఇండోనేషియా వాతావరణ సంస్థ BMKG.. వర్షాకాలం గరిష్ట సమయం నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశముండటంతో ప్రజలు వాలుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Earth quake, Indonesia, Singapore

తదుపరి వార్తలు