హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire explosion: బాణా సంచా యూనిట్ లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు..

Fire explosion: బాణా సంచా యూనిట్ లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya Pradesh: టపాకాయలను తయారు చేసే యూనిట్ లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద మంటలు వ్యాపించాయి. పేలుగు ధాటికి సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు.

Fire explosion: బాణా సంచా యూనిట్ లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు..Explosion At Illegal Madhya Pradesh Firecracker Unit: మధ్య ప్రదేశ్ లోని శివపురి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమేలా ప్రాంతంలో టపాకాయాలను తయారు చేసే యూనిట్ లో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు జరిగిన(Fire Explosion)  ప్రదేశంలో ఒక మహిళ,ఆమె కుమార్తె మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. శివపురి జిల్లాకు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బదర్వాస్ పట్టణంలో మధ్యాహ్నం ఘటన జరిగింది.

మహ్మద్ హుస్సేన్ అన్సారీకి చెందిన రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనపై వద్ద ఫైరింజన్ లతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. పేలుగు సంభవించగానే.. తబస్సుమ్ ఖాన్ (25), ఆమె కుమార్తె ఉమేరా (11) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడులో (Firecracker Unit) గాయపడిన.. అన్సారీ కుటుంబ సభ్యులు, మరి కొంతమంది కార్మికులను స్థానికులు శివపురి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. అన్సారీ సుమేలా గ్రామంలో బాణసంచా యూనిట్ (Firecracker Unit) నడుపుతున్నందుకు లైసెన్స్ కలిగి ఉన్నాడు. కానీ బదర్వాస్‌లోని నివాస ప్రాంతంలో అక్రమంగా మరో యూనిట్ నడుపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గతంలో ఢిల్లీలొో అగ్ని ప్రమాదం జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం (Delhi Fire Accident) జరిగింది. గోకల్‌పురి ప్రాంతంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలిపోయి దుర్మరణం చెందారు. గోకల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే పెద్ద ఎత్తున గుడిసెలు తగులబడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.

తెల్లవారుఝామున 4 గంటల సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఐతే అప్పటికే 60 గుడిసెలు తగులబడ్డాయి. పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఒక్కో గుడిసెను తనిఖీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో శవాలు బయటపడ్డాయి. మొత్తం ఏడుగురి శవాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు ఈ శాన్య ఢిల్లీ డీసీపీ  పేర్కొన్నారు.  అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా కాలిపోయాయని వెల్లడించారు.

First published:

Tags: Crime news, Fire Accident, Madhya pradesh

ఉత్తమ కథలు