2 BURNT ALIVE AFTER BIKE AND TRUCK COLLISION IN ANANTAPUR SK
Terrific accident: ఏపీలో ఘోర ప్రమాదం.. బైక్-లారీ ఢీ.. ఇద్దరు సజీవ దహనం
తగలబడుతున్న లారీ
బైక్ అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టిందని.. అనంతరం పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి రోడ్డుపైనే చనిపోయారని వెల్లడించారు.
ఏపీలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తిలో లారీ-బైక్ ఢీకొన్నాయి. అనంతరం మంటలు చెలరేగి రెండు వాహనాలూ కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు. మంటల్లో కాలి మరణించారు. వారిని కాపాడే సమయం కూడా లేకపోయింది. క్షణాల్లలోనే అంతా జరిగిపోయింది. గుత్తి మండలం ఎంగిలిబడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టిందని.. అనంతరం బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి రోడ్డుపైనే చనిపోయారని వెల్లడించారు. లారీ డ్రైవర్, క్లీనర్ మాత్రం స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఐతే చనిపోయిన ఆ ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.