19 YEARS OLD INTERMEDIATE STUDENT COMMITS SUICIDE IN HOSTEL ONGOLE PRAKASAM DISTRICT FULL DETAILS HERE HSN
Andhra Pradesh: పొద్దున్నే నిద్రలేచిన హాస్టల్ విద్యార్థులకు కనిపించిందో షాకింగ్ సీన్.. 19 ఏళ్ల ఆ ఇంటర్ విద్యార్థి చేసిన దారుణమిది..!
ప్రతీకాత్మక చిత్రం
ఓ 19 ఏళ్ల ఇంటర్ విద్యార్థి కాలేజీ హాస్టల్ కిచెన్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొద్దున్నే నిద్రలేచిన హాస్టల్ విద్యార్థులు ఆ షాకింగ్ సీన్ చూసి నివ్వెరపోయారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
క్షణికావేశంలో యువత దారుణాలకు తెగిస్తోంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకుంటోంది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారనో, స్కూల్లో కాలేజీల్లో ఉపాధ్యాయులు మందలించారనో మనస్తాపానికి గురవుతున్నారు. మనోవేదన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలే కాకుండా స్నేహితుల మధ్య, సోదరులు, అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న చిన్న చిన్న గొడవలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఉంటున్న కాలేజీ హాస్టల్ లోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తెల్లవారుజామున నిద్రలేచిన విద్యార్థులు అతడు చేసిన దారుణాన్ని చూసి నివ్వెరపోయారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసినా అప్పటికే మరణించాడని డాక్టర్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్ల మండలం రేగలగడ్డకు చెందిన దుంపా అంజిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ అనే భార్యాభర్తలకు 19 ఏళ్ల కుమారుడు దుంపా పవన్ కల్యాణ్ రెడ్డి ఉన్నాడు. అతడు ఒంగోలు సమీపంలో ఉన్న పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇల్లు కాస్త దూరంగా ఉండటంతో కాలేజీ వాళ్లు నిర్వహించే హాస్టల్ లోనే ఉండి చదువుకుంటున్నాడు. అయితే రోజూలాగానే శనివారం కూడా నిద్రలేచిన హాస్టల్ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలినట్టయింది. హాస్టల్ కిచెన్ రూంలో పవన్ కల్యాణ్ రెడ్డి ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మరణించినట్టు గ్రహించారు.
వెంటనే విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ నిర్వాహకులు వచ్చి చూస్తే అప్పటికే మరణించాడని తేల్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా పవన్ ఆత్మహత్యకు ఇటీవల జరిగిన పరిణామాలే కారణమని అతడి స్నేహితులు భావిస్తున్నారు. గతంలో జరిగిన పరీక్షల్లో పవన్ ఫెయిల్ అయ్యాడనీ, అందువల్ల అధ్యాపకులు పవన్ ను కొట్టారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం జరిగిన పరీక్షల్లో కూడా స్లిప్పులు పెట్టి దొరికిపోవడంతో కొట్టారనీ, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొదట పవన్ కు సీరియస్ గా ఉందనీ, ఆస్పత్రిలో చేర్చామని చెప్పారనీ తీరా ఆస్పత్రికి వెళ్తే అక్కడ కొడుకు శవమే కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.