మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

గాయత్రి (ఫైల్ ఫొటో)

రోజూ లాగానే ఆ రాత్రి కూడా రోజూలాగానే ముగ్గురు కూతుళ్లు కూడా పడుకునేందుకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ముగ్గురిలో ఓ కూతురు పక్కలో లేదు. బాత్రూంకు వెళ్లి ఉంటుందేమో అని ఇంట్లో వెతికారు. కానీ..

 • Share this:
  ఆ తల్లిదండ్రులకు ముగ్గురు కూతుళ్లు. రోజూ మేడ మీద ఉన్న గదిలో పడుకుంటుంటారు. అయితే మంగళవారం రాత్రి కూడా రోజూలాగానే ముగ్గురు కూతుళ్లు కూడా పడుకునేందుకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ముగ్గురిలో ఓ కూతురు పక్కలో లేదు. బాత్రూంకు వెళ్లి ఉంటుందేమో అని ఇంట్లో వెతికారు. కానీ ఆ యువతి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. అలా వెతుకుతున్న వారికి ఓ వ్యక్తి ఓ వార్త చెప్పాడు. రైలు పట్టాల వద్ద ఓ యువతి మృతదేహం ఉందని చెప్పాడు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి చూసి దిగ్భ్రాంతి చెందారు. ఇంట్లో నిద్రపోతూ ఉండాల్సిన కూతురు కాస్తా, రైలు పట్టాల వద్ద శవంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఉలాసి తనూజ అలియాస్ గాయత్రి అనే 19 ఏళ్ల యువతి ఉంటోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి తన తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి ఉంటోంది. రోజూ రాత్రి తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి మేడ మీద గదిలో పడుకుంటుంటారు. అయితే మంగళవారం రాత్రి కూడా రోజూలాగానే గదిలో పడుకోవడానికి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కయ్య పక్కలో లేకపోవడాన్ని చెల్లెళ్లు గమనించారు. ఇంట్లోని బాత్రూంలోనూ లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో స్థానికంగా ఉండే ఎల్సీ గేటు వద్ద ఓ యువతి మృతదేహం ఉందని ఆ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వాళ్లు వెళ్లి చూస్తే ఆ మృతదేహం గాయత్రిదే అని గుర్తుపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
  ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

  కాగా, గాయత్రి ఆత్మహత్యకు అసలు కారణాలేంటన్నది తెలియరాలేదు. గాయత్రికి ఇటీవల ఓ పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ఇష్టపడ్డారు కూడా. అయితే అబ్బాయి తరపు వాళ్లు అడిగినంత కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు వేరే సంబంధం చూద్దామని అనుకుంటున్నారు. ఈ విషయమై గాయత్రి ఏమైనా మనస్తాపానికి గురయిందా అన్న అనుమానాలు బంధువుల్లో కలుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
  Published by:Hasaan Kandula
  First published: