వరంగల్‌లో దారుణం.. పుట్టినరోజు నాడే యువతిపై గ్యాంగ్ రేప్..

పుట్టినరోజు కావడంతో గుడిలో దేవున్ని దర్శించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది.అలా వెళ్లిన యువతి.. రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు.

news18-telugu
Updated: November 28, 2019, 8:47 AM IST
వరంగల్‌లో దారుణం.. పుట్టినరోజు నాడే యువతిపై గ్యాంగ్ రేప్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పుట్టినరోజే ఆ యువతి జీవితంలో చివరి రోజుగా మిగిలిపోయింది. గుడికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి.. విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేనప్పటికీ.. మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు.దీన్నిబట్టి యువతిపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల యువతి బుధవారం ఉదయం గుడికి బయలుదేరింది. పుట్టినరోజు కావడంతో గుడిలో దేవున్ని దర్శించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది.అలా వెళ్లిన యువతి.. రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు.చాలాచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే క్రమంలో రాత్రి 10గంటలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం పడివున్నట్టుగా సమాచారం అందింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి.. ఆ యువతి విగతజీవిగా అక్కడ పడిపోయి ఉంది.బిడ్డను అలా చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పుట్టినరోజే చివరి రోజైందా అంటూ విలపించారు.పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. యువతి పడివున్న ప్రదేశం
నిర్మానుష్యంగా ఉండటం.. పక్కనే బీర్ సీసాలు ఉండటంతో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.తెలిసినవాళ్లే యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా..? లేక గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First published: November 28, 2019, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading