హోమ్ /వార్తలు /క్రైమ్ /

స్కూటీపై వెళ్తూ.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన 19 ఏళ్ల యువతి.. చివరకు జరిగిన ఘోరమిది..

స్కూటీపై వెళ్తూ.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన 19 ఏళ్ల యువతి.. చివరకు జరిగిన ఘోరమిది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ 19 ఏళ్ల యువతి.. స్కూటీపై వెళ్తుండగా నడిరోడ్డుపై ఓ గుంత కనిపించింది. దీన్ని తప్పించబోయిన ఆ యువతి స్కూటీని పక్కకు మళ్లించింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ఓ ట్రక్కు..

  ‘ఒక ప్రాణం పోయింది. ఒక కల చెదిరిపోయింది. మీ నిర్లక్ష్యం కారణంగా నా కూతురు చనిపోయింది. ఒక ప్రాణం పోతే కానీ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చరా.? ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి? దీనికి జవాబు ఎవరు చెబుతారు? ఎవరు బాధ్యత వహిస్తారు? నేను నా కూతురిని కోల్పోయాను. నాకు న్యాయం కావాలి‘ అంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించుకునేందుకు స్కూటీని పక్కకు మళ్లించగా, అదే సమయంలో వచ్చిన ఓ ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. ఫలితంగా ఆమె అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆ తండ్రి తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. అధికారులు ఒకరిమీద మరొకరు కారణాలు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  బెంగళూరులో ఫిబ్రవరి 5న లింగరాజపురం-హెన్నూర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తష్దీక్ బుష్రా అనే 19 ఏళ్ల యువతి మరణించింది. స్కూటీపై వెళ్తుండగా నడిరోడ్డుపై ఓ గుంత కనిపించింది. దీన్ని తప్పించబోయిన ఆ యువతి స్కూటీని పక్కకు మళ్లించింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ఓ ట్రక్కు ఆమె స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో మాత్రం వేగం చూపడం లేదు. ప్రమాదానికి కారణమయిన ట్రక్కు బెంగళూరు మహానగర పాలిక్ కు చెందినది కావడం కూడా ఓ కారణమని ఆ యువతి తండ్రి ముస్తఖ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  ఇది కూడా చదవండి: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే(వైరల్ వీడియో)

  ఈ ప్రమాదానికి ఆ ట్రక్కును నడిపిన వ్యక్తి కారణమా.? రోడ్లపై గుంతలను పూడ్చని అధికారులు కారణమా? హెల్మెట్ పెట్టుకుని మాస్కు కూడా ధరించి నిబంధనలను పాటిస్తున్న నా కూతురు కారణమా? అంటూ ఆ తండ్రి ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాడు. ఒక డిపార్ట్మెంట్ పై మరో డిపార్ట్మెంట్ అధికారులు సాకులు చెబుతూ, తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలంటే మనుషుల ప్రాణాలు పోవాల్సిందేనా.? అప్పటికి గానీ స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వాధికారులను కూడా దీనికి బాధ్యత వహించాలని కోర్టు మెట్లెక్కాడు. కాగా, ట్రక్కును నడిపిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Bus accident, Car accident, Crime news, Crime story, Fire Accident

  ఉత్తమ కథలు