హైదరాబాద్‌లో దారుణం... షాపుకు వచ్చే చిన్నారిపై యువకుడి అత్యాచారం

నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు

news18-telugu
Updated: November 20, 2019, 9:00 AM IST
హైదరాబాద్‌లో దారుణం... షాపుకు వచ్చే చిన్నారిపై యువకుడి అత్యాచారం
(నమూనా చిత్రం)
  • Share this:
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా.. అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిన్నారులని చూడకుండా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. పసివాళ్లపై కూడా తమ పైశాచికత్వం చూపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారుల్లో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా 19 ఏళ్ల యువకుడు ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపునకు నిత్యం వచ్చే ఐదేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది.

చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నారికి ఓ అక్క ఉంది. ఆమె ఆ సమయలో ఇంటి బయట ఆడుకుంటుంది. దీంతో అదును చూసి ఆ పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా ఏడవడటంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ కీచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన నవంబర్ 17 న చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడ్ని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 20, 2019, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading