మహిళను ఎత్తుకెళ్లి రేప్... 19 ఏళ్ల యువకుడు అరెస్టు....

44 ఏళ్ల మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినందుకు ఆ యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కు నెట్టారు.

news18-telugu
Updated: June 6, 2020, 11:30 AM IST
మహిళను ఎత్తుకెళ్లి రేప్... 19 ఏళ్ల యువకుడు అరెస్టు....
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా... ఇండియానా రాష్ట్రంలోని... ఎలెక్‌హార్ట్ కౌంటీలో జరిగిందీ దారుణం. జూన్ 3.... మధ్యాహ్నం 2 గంటలైంది. 44 ఏళ్ల బాధితురాలు తన ఇంటికి దగ్గర్లోనే ఉంది. చుట్టూ తుప్పలు. మనుషులెవరూ లేని ప్రాంతం. దగ్గర్లోని మరో ఇల్లు... అర కిలోమీటర్ అవతల ఉంది. అలాంటి చోటకు... 19 ఏళ్ల ఓ కుర్రాడు కారులో వచ్చాడు. కారు దిగి... వాటర్ కావాలంటూ... ఆమె దగ్గరకు వచ్చాడు. రోడ్డు పక్కన ఎన్నో ఇళ్లుంటాయి. అలాంటిది... రోడ్డు పక్కన లేని తమ ఇంటికి వాటర్ కోసం వస్తున్నాడేంటి అనుకుందామె. అలా ఆలోచిస్తుంటే... ఆ యువకుడు దగ్గర దాకా వచ్చి... సడెన్‌గా గన్ తీసి... ఆమె నడుం దగ్గర పెట్టాడు. మాగ్జిన్ ఫుల్లుగా ఉంది. ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి అన్నాడు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

అసలే కోరనా సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్న రోజులివి. అతను చూస్తే... ఆమెకు పక్కనే వచ్చి నిల్చున్నాడు. గన్ ట్రిగ్గర్ నొక్కుతుంటే భయపడిన ఆమె... అతను చెప్పినట్లు చేసింది. తన కారు ఎక్కమన్నాడు. ఎక్కింది. ఆమెకు గన్ గురి పెట్టి ఉంచి... ఎక్కడో మారుమూల ఉన్న అడవిలాంటి ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె లోపలికి వెళ్లేందుకు వెనకడుకు వేస్తుంటే... బలవంతంగా నెట్టాడు. అమె గట్టిగా అరుద్దామన్నా... అక్కడ చుట్టూ ఏమీ లేవు. అంతా అడవి లాంటి తుప్పలే. అక్కడ ఆమెను రేప్ చేశాడు. గన్ గురి పెట్టి బెదిరించడంతో... ఆమె అతని నుంచి తప్పించుకోలేకపోయింది.

అత్యాచారం తర్వాత... అతను మరో గదిలోకి వెళ్లడంతో... అక్కడి నుంచి తప్పించుకొని... పారిపోయిన ఆమెకు... రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత... అక్కడో రోడ్డు కనిపించింది. అటుగా వస్తున్న ఓ వాహనాన్ని ఆపి... పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పింది. కొన్ని నిమిషాల్లో అక్కడికి వచ్చిన పోలీసులు... ఎక్కడ ఆ కొండెగాడు... అంటూ... ఆమె నుంచి వివరాలు తీసుకున్నారు. ఆమెను ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి పంపారు. తర్వాత... తుప్పలున్న ఇంటికి వెళ్లారు. పోలీసుల్ని చూడగానే... మ్యూజిక్ వింటున్న వాడు కాస్తా... అది ఆపేసి... నా దగ్గరకు రావొద్దు. కాల్చుకొని చస్తాను. అంటూ... తన గన్‌ను తనకే గురిపెట్టుకున్నాడు.

కొంతసేపు సీన్ క్రియేట్ చేశాక... పోలీసుు... నీకు ఏం కాదు... ఏమవ్వదు... అని బుజ్జగించి... అతన్ని పట్టుకున్నారు. గన్ లాక్కున్నారు. కటకటాల వెనక్కి నెట్టారు. అతనిపై కిడ్నాప్, రేప్, పోలీసుల్ని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొన్ని రోజులుగా... ఆ ఇంట్లో మధ్యాహ్నం వేళ మహిళ మాత్రమే ఉండటాన్ని గమనించి అతను ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
First published: June 6, 2020, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading