HOME »NEWS »CRIME »19 year old maid found hanging in employer flat in delhi su

యజమాని ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన 19 ఏళ్ల పనిమనిషి

యజమాని ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన 19 ఏళ్ల పనిమనిషి
ప్రతీకాత్మక చిత్రం

Maid Found Hanging: ఓ యువతి తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించింది. గత నాలుగైదు నెలలుగా ఆ ఫ్లాట్‌లో పనిచేస్తున్న ఆ యువతి అక్కడే నివాసం ఉంటుంది.

  • Share this:
    ఓ యువతి తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించింది.ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బాధితురాలిని గోయ్లా డైరీ ప్రాంతానికి చెందిన శివానిగా గుర్తించారు. వివరాలు.. ఢిల్లీ ద్వారాక సెక్టార్-19 ప్రాంతంలోని అక్షరధామమ్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో శివాని పనిమనిషిగా చేస్తోంది. అయితే ఆమె పనిచేస్తున్న ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులకు శివాని క్లాత్‌ ముక్కతో ఉరివేసుకుని కనిపించింది.

    ఇందుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. "అశిశ్ ఠాకూర్‌ అనే వ్యక్తి ఆ ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్నాడు. గత ఐదేళ్లుగా అదే ఫ్లాట్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అశిశ్, అతని భార్య ఇద్దరు గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నారు. వారి ఫ్లాట్‌లోనే శివాని నాలుగైదు నెలల నుంచి పనిమనిషిగా చేస్తోంది. అలాగే అక్కడే ఉంటుంది. గత నాలుగైదు నెలల నుంచి ఆ ఫ్లాట్‌లో పనిచేస్తుందని, అక్కడే ఉంటుందని పోలీసులు తెలిపారు. సమయం దొరికినప్పుడుల్లా ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తుండేంది. వారు కూడా ఇక్కడికి వచ్చి శివానిని చూసివేళ్లేవారు" తెలిపారు.



    ఇక, ఆత్మహత్యకు పాల్పడ్డ శివాని శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. శివాని మృతదేహానికి డీడీయూ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:January 11, 2021, 12:16 IST