అమెరికాలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం, హత్య..

అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై దారుణం జరిగింది. పై చదువుల కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు కొందరు దుండగులు.

news18-telugu
Updated: November 26, 2019, 12:19 PM IST
అమెరికాలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం, హత్య..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై దారుణం జరిగింది. పై చదువుల కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు కొందరు దుండగులు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన రూత్ జార్జ్(19) అనే యువతి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో చదువుతోంది. అయితే.. శుక్రవారం నుంచి ఆమె అందుబాటులోకి రావడం లేదని ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆచూకీ కోసం సిబ్బంది గాలించగా.. యూనివర్సిటీ గ్యారేజీలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించగా ఈ నెల 22న ఆమెను దారుణంగా రేప్ చేసి, హత్య చేసినట్లు తేలింది. పోలీసులు విచారణ చేపట్టి ఓ నిందితుడిని అరెస్టు చేశారు.

అతడ్ని డోనాల్డ్ తుర్‌మాన్(26)గా పోలీసులు గుర్తించారు. అతడు యూనివర్సిటీకి చెందినవాడు కాదని, ఇంతకుముందే అతడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. కాగా.. రూత్ జార్జ్ దారుణ హత్యపై యూనివర్సిటీ స్పందించింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానభూతి ప్రకటించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 26, 2019, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading