హోమ్ /వార్తలు /క్రైమ్ /

అతడికి 67 ఏళ్లు.. ఆమెకు 19 ఏళ్ల వయస్సు.. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..

అతడికి 67 ఏళ్లు.. ఆమెకు 19 ఏళ్ల వయస్సు.. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..

అతడికి 67 ఏళ్లు.. ఆమెకు 19 ఏళ్ల వయస్సు.. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి..

అతడికి 67 ఏళ్లు.. ఆమెకు 19 ఏళ్ల వయస్సు.. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి..

19 ఏళ్ల యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబంతో ఇతడికి పరిచయం ఉంది. ఆ భూతగాదాను తాను పరిష్కరిస్తానని చెప్పి ఆ కుటుంబంతో కలిసిపోయాడు.

అతడికి 67 ఏళ్ల వయస్సు. ఆయనకి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అతడికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. చక్కగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించాల్సిన వయసులో అతడు 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరినీ పక్కపక్కన నిలబెట్టి చూస్తే తాతా మనవరాలు అని అంతా అనుకుంటారు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంత లేటు వయసులో అంత తక్కువ వయసు పిల్లతో పెళ్లేంటంటూ అతడి కూతుళ్లు, తాత వయసు వాడితో పెళ్లేంటని ఆ యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు గొడవకు దిగారు.దీంతో ఆ వృద్ధుడు, ఆ యువతి తమకు రక్షణ కల్పించాలంటూ మొదట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి వ్యవహారంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఇరువురినీ వేరు వేరు చోట్ల ఉంచి రక్షణ కల్పించాలనీ, అదే సమయంలో ఈ 67ఏళ్ల వృద్ధుడి వ్యవహారం గురించి, గతంలో అతడి ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. . ఆ యువతి కూడా స్వయంగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరయి తన స్టేట్‌మెంట్‌ను ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుబోయే నిజాలు తెలిశాయి.

ఈ ప్రేమపెళ్లిపై మొదట్లో అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. బెదిరించో, భయపెట్టో ఆ యువతిని వృద్ధుడు పెళ్లికి ఒప్పించి ఉంటాడని అంతా భావించారు. పోలీసులు కూడా ఆ దిశగానే విచారణ ప్రారంభించారు. అయితే విచారణలో మాత్రం పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇష్టపూర్వకంగానే అతడిని పెళ్లి చేసుకున్నానని సదరు యువతి చెప్పడంతో విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.


" నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు. నా అంతట నేనే అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మా అమ్మకు ఈ విషయం తెలుసు. ఆమె అంగీకరించింది కూడా. పెళ్లి సమయంలో ఆయన బంగారం కూడా పెట్టారు. ఆయనతో పెళ్లి విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఆయనకు గతంలోనే పెళ్లయిందనీ, ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని నాకు తెలుసు. వాళ్లెవరూ ప్రస్తుతం ఆయన వద్ద లేరు. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారం వారిది. నాకు కూడా గతంలో పెళ్లయింది. నా భర్త నుంచి నేను విడిపోయాను. ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాను. నా మాజీ భర్తకు కూడా ఈ పెళ్లి విషయంలో అభ్యంతరం లేదు. దీనిలో ఎవరి ఒత్తిడి లేదు. నన్ను ఎవరూ మభ్యపెట్టలేదు" అని ఆ యువతి స్వయంగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చింది.

ఇది కూడా చదవండి : 18 ఏళ్ల సచిన్ టెండూల్కర్.. 23 ఏళ్ల అంజలి ప్రేమలో ఎలా పడిపోయాడంటే..

అయితే, 19 ఏళ్ల యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబంతో ఇతడికి పరిచయం ఉంది. ఆ భూతగాదాను తాను పరిష్కరిస్తానని చెప్పి ఆ కుటుంబంతో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే ఆ 19 ఏళ్ల యువతితో చనువు పెంచుకున్నాడు. ఆ యువతికి కూడా అంతకుముందే పెళ్లయింది. భర్తతో గొడవల కారణంగా మళ్లీ పుట్టింటికే వచ్చింది. ఆ వృద్ధుడు ఏం మాయమాటలు చెప్పాడో.. ఆ యువతి ఏమని భావించిందో ఏమో కానీ ఇద్దరూ కలిసి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆమె స్టేట్‌మెంట్ స్పష్టంగా ఉండడంతో.. ఈ కేసులో కోర్టు ఏమని తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇద్దరికీ వయసు రీత్యా భారీ తేడా ఉన్నా.. ఇద్దరూ మేజర్లే కావడం, ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగిందనడంతో తీర్పు ఎలా వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Crime news, Haryana, High Court, Love marriage

ఉత్తమ కథలు