• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 19 YEAR OLD BOY BOOKED FOR RAPING A GIRL IN MOVING TRAIN IN THANE SK

Rape in Train: రైల్లో ఘోరం.. యువతిని టాయిలెట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం

Rape in Train: రైల్లో ఘోరం.. యువతిని టాయిలెట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతిని ఆమె స్నేహితుడే రైల్లో అత్యాచారం చేశాడు. ఆమెను బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తెల్లవారుజామున రైల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

  • Share this:
    దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానెలో దారుణం జరిగింది. ఓ యువతిని ఆమె స్నేహితుడే రైల్లో అత్యాచారం చేశాడు. ఆమెను బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తెల్లవారుజామున రైల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    వారు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మిత్రులు. ఇద్దరూ ముంబైలో ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. యువతి వద్ద రూ. 2 లక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టాయిలెట్‌లో రేప్ చేసిన తర్వాత ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు బయటకు వచ్చారు. అప్పుడు రైలు పుణె రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంది. అదే సమయంలో టీటీఈ అటుగా వచ్చి యువతిని టికెట్ అడిగాడు. కానీ ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో టీటీఈ కిందకు దింపేశాడు. నేను కూడా నీతో వస్తానని చెప్పిన ఆ యువకుడు.. ఆమె కళ్లు గప్పి అదే రైళ్లో వెళ్లిపోయాడు.

    అనంతరం జరిగిన విషయాన్ని రైల్వే పోలీసులకు చెప్పి కంటతడి పెట్టింది బాధితురాలు. పోలీసులకు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇఫ్పటికే ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published: