Home /News /crime /

18 YEARS OLD YOUNG MAN COMMITS SUICIDE AFTER UNBEARABLE HARASSMENT FROM WIFE AND GIRLFRIEND IN HYDERABAD HSN

Hyderabad: ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. ఇంతలోనే మరో యువతితో ప్రేమయాణం.. ఓ 18 ఏళ్ల కుర్రాడి నిర్వాకమిది.. చివరకు ఊహించని ఘోరం..!

దీపక్ కుమార్ (ఫైల్ ఫొటో)

దీపక్ కుమార్ (ఫైల్ ఫొటో)

ప్రేమ పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల కుర్రాడు దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లయిన ఏడాదిలోపే మరో యువతితో యవ్వారాన్ని ప్రారంభించాడు. ఈ విషయం కాస్తా అతడి భార్యకు తెలిసింది. నిలదీస్తే..

    18 ఏళ్ల ఓ కుర్రాడు. ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి ఓ యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తండ్రి చేసే పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అప్పటి వరకు అల్లరిచిల్లరగా తిరిగిన కొడుకు దారిలోకి వచ్చాడని ఆ తండ్రి మురిసిపోయాడు. పెళ్లి చేయడంతో బాధ్యతలు తెలిసి వచ్చాయని భావించాడు. కానీ ఆ కుర్రాడిలో మాత్రం ఇంకా కుర్రతనం పోలేదు. ఇంట్లో భార్య ఉన్నా మరో యువతి వెంట పడ్డాడు. ఆమెతో ప్రేమ కలాపాలు జరిపాడు. శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆ కుర్రాడి భార్యకు తెలిసింది. అంతే ఈ విషయమై ఇంట్లో రోజూ గొడవలు. అటు భార్య ఆగ్రహావేశాలు.. మరో వైపు పెళ్లి చేసుకుందామంటూ ప్రేయసి ఒత్తిళ్లు తట్టుకోలేక చివరకు ప్రాణాలు వదిలేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని రెయిన్ బజార్ కు చెందిన జమాల్పుర్ కరణ్ లాల్ అనే వ్యక్తి మాంసం విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అతడికి 18 ఏళ్ల దీపక్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. అల్లరిచిల్లరగా తిరుగుతున్నా అప్పుడప్పుడు తండ్రికి పనుల్లో సాయం చేసేవాడు. గతేడాది హయత్ నగర్ కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్ లోనే భార్యతో కాపురం పెట్టాడు. పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ పెళ్లి కూడా చేసుకోవడంతో తండ్రి సంతోషించాడు. అయితే పెళ్లయిన తర్వాత కూడా దీపక్ అమ్మాయిల వెంట పడటం మానుకోలేదు. అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో దీపక్ ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి భార్యకు తెలిసింది. కొద్ది రోజులుగా ఇంట్లో ఇదే విషయమై గొడవలు కూడా జరుగుతున్నాయి.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    అయితే అదే సమయంలో ప్రేయసి నుంచి కూడా పెళ్లి పేరిట ఒత్తిళ్లు పెరిగాయి. ఈ విషయాలను స్నేహితులతో కూడా చెప్పుకుని బాధపడేవాడు. అటు భార్య, ఇటు ప్రేయసి ఒత్తిళ్లు భరించలేక చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శనివారం సాయంత్రం ధోబీఘాట్ వద్దకు వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. ‘నాన్నా.. జీవితంపై విరక్తి పుట్టింది. ఎర్రకుంట చెరువు సమీపంలో పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా‘ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. కంగారు పడిన తండ్రి 108కు ఫోన్ చేశాడు. దీంతో సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దీపక్ కుమార్ ఓ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Telangana crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు