Home /News /crime /

18 YEARS OLD DEGREE STUDENT COMMITS SUICIDE DUE TO SMALL FIGHT WITH BROTHER IN PRAKASAM DISTRICT HSN

అర్ధరాత్రి.. రెండు గంటల సమయం.. గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు.. ఆ 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఏం చేసిందంటే..

ఆత్మహత్య చేసుకున్న యువతి (ఫైల్ ఫొటోో)

ఆత్మహత్య చేసుకున్న యువతి (ఫైల్ ఫొటోో)

ప్రకాశం జిల్లా దర్శి మండలంలో బొట్లపాలెంలో గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తికి 18 ఏళ్ల కుమార్తె లక్ష్మీప్రసన్న, మరో కుమారుడు ఉన్నాడు. కుమార్తె దర్శిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుకుంటోంది.

    అర్ధరాత్రి. రెండు గంటల సమయం. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్నారు. కానీ ఓ యువతి మాత్రం ఇంకా మెలకువగానే ఉంది. సగం నిద్రలో ఉండగా మెలకువ రావడం ఏమీ జరగలేదు. ఆమె అసలు ఆ రాత్రి నిద్రే పోలేదు. తీవ్రంగా ఆలోచిస్తోంది. బాధపడుతోంది. ఆవేదన చెందుతోంది. తనలో తానే కుమిలిపోతోంది. ఏడుస్తోంది. చివరకు ఓ నిర్ణయం తీసుకుంది. తన గది నుంచి బయటకు వచ్చింది. ఇంట్లో ఉన్న పెట్రోలును తీసుకుంది. వంటింట్లోకి వెళ్లింది. తనపై పోసుకుంది. ఆ తర్వాత నిప్పంటించుకుంది. ఓ వైపు గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు. మరో వైపు పెట్రోలు మంటల్లో కుమార్తె. ఆ పెట్రోలు మంటల వాసనకు, మంటలు తాళలేక కుమార్తె చేస్తున్న అరుపులకు ఆ తల్లిదండ్రులకు మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి నిద్రలేచి వంటగదిలోకి వచ్చి చూసేసరికే ఆమె మరణించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా దర్శి మండలంలో బొట్లపాలెంలో గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తికి 18 ఏళ్ల కుమార్తె లక్ష్మీప్రసన్న, మరో కుమారుడు ఉన్నాడు. కుమార్తె దర్శిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుకుంటోంది. ఆమె తమ్ముడు కూడా దర్శిలోనే చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల తమ్ముడికి, లక్ష్మీకుమార్తెకు మధ్య అస్సలు పడటం లేదు. తాను చెప్పే ప్రతీ మాటకు తమ్ముడు ఎదురుతిరుగుతున్నాడనీ, తనను లెక్కచేయడం లేదని లక్ష్మీప్రసన్న ఆవేదన చెందుతోంది. ఈ క్రమంలోనే బుధవారం సాయత్రం కూడా అక్కాతమ్ముడి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే ఆ చిన్న చిన్న గొడవలనే లక్ష్మీప్రసన్న సీరియస్ గా తీసుకుంది. అంతా తననే తప్పు పడుతున్నారని ఆవేదన చెందింది.
    ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఒంటరిగా భార్య.. పొలం నుంచి వస్తుండగా ఓ వ్యక్తి ఇంట్లోంచి పారిపోవడాన్ని చూసిన భర్త.. చివరకు..

    ఆ రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. ఏడుస్తూ కుమిలిపోయింది. బుధవారం రాత్రి 2గంటల సమయంలో తన గది నుంచి బయటకు వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు, తమ్ముడు గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఇంటిలో పవర్ స్ప్రేయర్ లో ఉన్న పెట్రోల్ ను తీసుకుని వంట గదిలోకి వెళ్లింది. అక్కడ ఆ పెట్రోల్ ను తనపై పోసుకుని నిప్పంటించుకుంది. పెట్రోలు మంటల వాసన రావడం, మంటలు భరించలేక కుమార్తె అరవడం విని ఆ తల్లిదండ్రులు కంగారుగా ఉలిక్కిపడి లేచారు. వారు వంటగదిలోకి చేరుకునే సరికే ఆమె మరణించింది. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. అన్ని విషయాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో కుమార్తె ఇలాంటి దారుణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఇంట్లోంచి భార్య మాయం.. ప్రియుడితో వెళ్లిందని తెలిసి వెతుక్కుంటూ వెళ్లిన భర్త.. చివరకు కథ అడ్డం తిరిగింది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, Illegal affairs, Prakasam

    తదుపరి వార్తలు