హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ కన్నుమూత

Shocking: ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ కన్నుమూత

దీనదయాళన్ (ఫైల్)

దీనదయాళన్ (ఫైల్)

Assam:  గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీనదయాళన్ ఆదివారం కన్నుమూశారు.

Tamil Nadu Table Tennis Player Vishwa Deenadayalan died:  తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీనదయాళన్ ఆదివారం కన్నుమూశారు. గౌహతి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది.  ఈ ఘటన జరిరగినప్పుడు కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. సోమవారం నుంచి 83వ సీనియర్ జాతీయ, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల కోసం, తన సహచరులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు ప్రత్యేక వాహానంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో.. విశ్వ దీన దయాళన్ తో పాటు, డ్రైవర్ కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మిగతవారికి.. రమేష్ సంతోష్ కుమార్, అబినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిషోర్ కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరికి చికిత్స చేస్తున్న వైద్యులు వీరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ప్రకటించారు.


ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశ్వ చనిపోయినట్లు నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. మేఘాలయ ప్రభుత్వం సహాయంతో నిర్వాహకులు విశ్వ, అతని ముగ్గురు సహచరులను ఆసుపత్రికి తరలించారు. విశ్వ, అనేక జాతీయ ర్యాంకింగ్ టైటిళ్లు, అంతర్జాతీయ పతకాలు సాధించాడు.

ఏప్రిల్ 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే WTT యూత్ కంటెండర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. విశ్వదీనదయాళన్ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

First published:

Tags: Car accident, Tamilnadu, Tennis

ఉత్తమ కథలు