Home /News /crime /

18 YEAR OLD GANG RAPED STABBED BY 5 YOUTHS IN MADHYA PRADESHS INDORE POLICE IN CONFUSION AND SAYS LACK OF EVIDENCE GH SRD

Indore gang rape: గ్యాంగ్ రేప్, సజీవ దహన యత్నం.. షాక్ లో పోలీసులు..అసలేం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indore gang rape: తనను గ్యాంగ్ రేప్ (gang rape) చేసి, సజీవంగా దహనం ప్రయత్నం చేశారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. అయితే, యువతి మాటలకు పొంతన లేదని.. పోలీసులు చేతులేత్తేశారు.

తనను గ్యాంగ్ రేప్ (gang rape) చేసి, సజీవంగా దహనం ప్రయత్నం చేశారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. అయితే, యువతి మాటలకు పొంతన లేదని, వీటిని రుజువు చేసే సాక్షాధారాలు లేవంటూ ఇండోర్ (Indore) పోలీసులు చేతులెత్తేశారు. అయితే, మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు మాత్రం ఇంకా అధికారికంగా స్పందించటం లేదు. ఇక వివరాల్లోకి వెళితే.. ఓ 18 ఏళ్ల అమ్మాయి.. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) ఇండోర్ సిటీలో ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా ..అక్షయ్ గుప్తా అనే తన స్నేహితుడు, అతని మిత్రుడు కలిసి.. తనకు మత్తు మందు ఇచ్చారని.. ఆతరువాత వారు ఆమెను సమీపంలోని భగీరథ్పురా రైల్వే ట్రాక్స్ వద్దకు బలవంతంగా తీసుకెళ్లారని బాధితురాలు ఆరోపిస్తోంది. అక్కడ అప్పటికే తమకోసం వేచి చూస్తున్న మరో ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, కత్తితో పొడిచి, ఆతరువాత గోనెసంచిలో చుట్టి, సజీవ దహనం చేసే ప్రయత్నం చేసినట్టు యువతి ఆరోపిస్తోంది. అయితే అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని తనకు కాబోయే భర్తకు కాల్ చేయగా అతను మరో వ్యక్తిని సాయంగా తీసుకుని వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు యువతి చెబుతోంది.

ఎటువంటి ఆధారాలు లేవు..

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలికి కాబోయే భర్త ఆమెను రక్షించిన విధానం వివరించాడు. బాధితురాలు, ఆమె ఫియాన్సీని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ అలాంటివి జరిగినట్టు ఏమాత్రం ఆనవాళ్లు లేవని, సాక్షాధారులు కూడా కనిపించలేదని చెబుతున్నారు. పైపెచ్చు అమ్మాయిపై చిన్న గాయం అయింది కానీ లోతైన గాయాలు కత్తి పోట్లు వంటివేం లేవని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు స్పష్టంచేశారు. బాధితురాలి కథనం ప్రకారం అక్షయ్ ని అతను ఉంటున్న ఇంటి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తనకేం తెలియదని అతను వాదిస్తుండటంతో కథ మలుపులు తిరిగింది. మరోవైపు అమ్మాయి ఆరోపణలకు బలం చేకూర్చే సాక్షాలు ఏమాత్రం లేకపోవటంతో ఇదంతా కల్పితంగా, దీనివెనకున్న కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Crime, Crime news, Indore, Madhya pradesh, Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు